...
...
Next Story

OTT Thrillers: ఏం క్లైమాక్స్ ట్విస్ట్ గురూ.. ఓటీటీలో మిస్ అవ‌కుండా చూడాల్సిన టాప్ 5 క్రైమ్ థ్రిల్ల‌ర్లు.. ఓ లుక్కేయండి

OTT Thrillers: ఓటీటీలో చాలా థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో డిఫరెంట్ జోనర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ థ్రిల్లర్లలో మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ తో ఉండే క్రైమ్ థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంటుంది. ఓటీటీలో మీరు మిస్ అవకుండా చూడాల్సిన అలాంటి టాప్ 5 థ్రిల్లర్లే ఇవి. ఓ లుక్కేయండి.

Published on: Jun 14, 2026, 20:06:15 IST
Advertisement

OTT Thrillers: కొన్ని సినిమాలను థియేటర్ బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని మాత్రం మన బుర్రలో చాలా సేపు ఉండిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ క్రైమ్ థ్రిల్లర్లు కూడా అలాంటివే. మైండ్ బ్లాక్ చేసే క్లైమాక్స్ ట్విస్ట్ లతో సాగే ఈ సినిమాలను ఓటీటీలో తప్పకుండా చూడాల్సిందే.

ఆర్టికల్ 15

ఏం క్లైమాక్స్ ట్విస్ట్ గురూ.. ఓటీటీలో మిస్ అవ‌కుండా చూడాల్సిన టాప్ 5 క్రైమ్ థ్రిల్ల‌ర్లు
ఏం క్లైమాక్స్ ట్విస్ట్ గురూ.. ఓటీటీలో మిస్ అవ‌కుండా చూడాల్సిన టాప్ 5 క్రైమ్ థ్రిల్ల‌ర్లు

ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్ ప్లే చేసిన ‘ఆర్టికల్ 15’ మూవీ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. భారత రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 15' (కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా ఎలాంటి వివక్ష చూపకూడదు) అనే హక్కు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల (ముఖ్యంగా 2014 బదౌన్ అత్యాచార ఉదంతం) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు బాలికలను దారుణంగా గ్యాంగ్ రేపు చేసి చంపేస్తారు. ఈ కేసును ఎలా సాల్వ్ చేశారన్నది ఉత్కంఠ కలిగిస్తుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది.

కహాని

2012లో సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన బాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘కహాని’. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది. గర్భిణిగా ఉన్న హీరోయిన్ కనిపించకుండా పోయిన తన భర్తను వెతుకుతూ ఉంటుంది. కానీ అతను టెర్రరిస్ట్ అని అందరూ అంటారు. మరోవైపు హీరోయిన్ కు సాయం చేసేవాళ్లను ఓ సైకో కిల్లర్ చంపుతుంటాడు. దీని క్లైమాక్స్ వేరే లెవల్ మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఇస్తుంది. కహాని మూవీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఉంది.

అగ్లీ

కమల్ హాసన్, వెంకటేష్ లీడ్ రోల్స్ ప్లే చేసిన థ్రిల్లర్ ‘ఈనాడు’ గురించి కూడా స్పెషల్ గా చెప్పుకోవాలి. ఈ చిత్రం క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. చక్రి తోలేటి ఈ సినిమాకు డైరెక్టర్. పోలీస్ కమీషనర్ ఈశ్వర్ ప్రసాద్(వెంకటేష్) కి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు(కమల్ హాసన్) నుంచి ఓ బెదిరింపు కాల్ వస్తుంది.

తాను సిటీలో అయిదు బాంబులు పెట్టానని అతను చెప్తాడు. జైల్లో ఉన్న నలుగురు టెర్రరిస్ట్ లను వదిలిపెట్టకపోతే ఆ బాంబులను పేలుస్తానని బెదిరిస్తాడు. అప్పుడు ఏం జరిగింది? ఈశ్వర్ ప్రసాద్ తన మిషన్ లో ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మిగతా కథ. దీన్ని యూట్యూబ్ లో చూడొచ్చు.

ది తాష్కెంట్ ఫైల్స్

భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక ఉన్న మిస్టరీ, కుట్రల చుట్టూ తిరిగే పొలిటికల్ థ్రిల్లర్ సినిమానే ‘ది తాష్కెంట్ ఫైల్స్’. దీనికి వివేక్ అగ్నిహోత్రి డైరెక్టర్. 1966 జనవరి 10న, పాకిస్తాన్‌తో తాష్కెంట్ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే లాల్ బహదూర్ శాస్త్రి సోవియట్ రష్యాలోని తాష్కెంట్‌లో మరణించారు. ఆయనది సహజ మరణమా (గుండెపోటు) లేక హత్యకు గురయ్యారా అనే అంశంపై ఈ సినిమా ఫోకస్ పెడుతుంది. ఇది జీ5 ఓటీటీలో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks