...
...
Next Story

OTT Weekend: ఓటీటీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌లో మిస్ అవ్వకూడని 5 మస్ట్ వాచ్ సినిమాలు!

OTT Weekend: వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఎలాంటి గందరగోళం లేకుండా ఈ సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. ఇక్కడ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. ఇందులో ఒక్కో భాష నుంచి ఒక్కో బ్లాక్ బస్టర్ ఉంది.

Published on: Sep 19, 2026, 20:47:05 IST
Advertisement

OTT Weekend: ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో వినోదాల జాతర జోరుమీదుంది. టాలీవుడ్ నుంచి మాస్ మహారాజా రవితేజ ఎమోషనల్ డ్రామా 'ఇరుముడి' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా, తమిళం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'మొద రాతిరి' డార్క్ కామెడీ అలరిస్తోంది. ఈ వీకెండ్ కు ఈ వారం విడుదలైన ఈ టాప్ 5 ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ఇరుముడి (Netflix)

ఓటీటీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌లో మిస్ అవ్వకూడని 5 మస్ట్ వాచ్ సినిమాలు!
ఓటీటీ ప్రియులకు పండగే పండగ.. ఈ వారం నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్‌లో మిస్ అవ్వకూడని 5 మస్ట్ వాచ్ సినిమాలు!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫాదర్-డాటర్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం.. తండ్రి బాధ్యత, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో సాగే సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది.

మద్యం అలవాటు ఉన్న తండ్రి తన కూతురి కోసం దీక్ష చేపట్టి, గ్రామంలోని బాలికలను రక్షించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను డైరెక్టర్ శివ నిర్వాణ ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఓటీటీలో రిలీజైంది.

మొద రాతిరి (Netflix)

మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ భాగస్వామ్యంలో రూపుదిద్దుకున్న తమిళ డార్క్ కామెడీ చిత్రం 'మొద రాతిరి' కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే రిలీజైంది. రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో పల్లెటూరి పెళ్లి వేడుకలో జరిగే అనూహ్య పరిణామాలు, రాత్రికి రాత్రే పెళ్లి పీటల నుంచి తప్పించుకునే నూతన జంట ప్రయాణం నవ్వులు పూయిస్తుంది.

మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన సరికొత్త మిస్టరీ డ్రామా 'తుడక్కం' (Thudakkam). మోహన్ లాల్ కూతురు విస్మయ డెబ్యూ మూవీ ఇది. తుడక్కం ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. మలయాళ మూలంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల ఆడియో ట్రాక్స్‌తో ఈ సినిమా వీక్షించడానికి రెడీగా ఉంది.

మృత్యుదేవతే (Prime Video Rent)

కన్నడలో తెరకెక్కిన వినూత్న మైథలాజికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మృత్యుదేవతే' (Mruthyudevate) ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే ఇది ఉచిత స్ట్రీమింగ్‌గా కాకుండా రెంట్ విధానంలో వ్యూయర్స్‌కు లభిస్తోంది. అమ్మాయిలను రేప్ చేసి చంపేసే సైకో గ్యాంగ్ ను ఎవరు అంతం చేశారనే కథలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

లస్ట్ స్టోరీస్ 3 (Netflix)

బాలీవుడ్‌లో అత్యంత క్రేజ్ పొందిన ఆంథాలజీ ఫ్రాంచైజీలో మూడో భాగం 'లస్ట్ స్టోరీస్ 3' (Lust Stories 3) నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. నలుగురు ప్రముఖ బాలీవుడ్ దర్శకులు తెరకెక్కించిన కథల సమాహారం ఇది. హిందీ ఒరిజినల్ ఆడియోతో పాటు తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లు కూడా ఈ బోల్డ్ సినిమా అందుబాటులో ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks