...
...
Next Story

Yash Tara Sutaria: యశ్ ప్రవర్తన బయట భిన్నంగా ఉంటుంది.. హీరోయిన్లకే అలా ఎందుకు.. టాక్సిక్ నటి తారా సుతారియా కామెంట్స్

Tara Sutaria Comments On Yash Over Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా థియేటర్లలో నెగెటివ్ టాక్ మూడటగ్గుటుకుంటోంది. ఈ క్రమంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ తారా సుతారియా నిజ జీవితంలో యశ్ ప్రవర్తనపై, హీరోలకు లేని పోలికలపై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Aug 29, 2026, 09:45:13 IST
Advertisement

Tara Sutaria Comments On Yash Over Toxic: 'కేజీఎఫ్' ఘనవిజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది.

టాక్సిక్ సినిమాపై భిన్నాభిప్రాయాలు

యశ్ ప్రవర్తన బయట భిన్నంగా ఉంటుంది.. హీరోయిన్లకే అలా ఎందుకు.. టాక్సిక్ నటి తారా సుతారియా కామెంట్స్ (Photo: Instagram)
యశ్ ప్రవర్తన బయట భిన్నంగా ఉంటుంది.. హీరోయిన్లకే అలా ఎందుకు.. టాక్సిక్ నటి తారా సుతారియా కామెంట్స్ (Photo: Instagram)

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో జోరు చూపిస్తున్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మాత్రం టాక్సిక్ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమాలో నటీనటుల అనుభవాలు, షూటింగ్ విశేషాలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి.

స్క్రీన్‌పై వైలెంట్.. రియల్ లైఫ్‌లో కేరింగ్!

టాక్సిక్ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించిన బాలీవుడ్ భామ తారా సుతారియా ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని యశ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తెరపై మాస్, ఆల్ఫా మేల్ క్యారెక్టర్లలో కనిపించే యశ్ నిజ జీవితంలో ఎలా ఉంటారనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చింది.

అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఒకరు

"ఆయన నా కెరీర్‌లో చూసిన అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ఒకరు. తన కంటే ఎక్కువగా ఎదుటివారి గురించి ఆలోచిస్తారు. మన చిత్ర పరిశ్రమలో ఇలాంటి మనుషులు చాలా అరుదుగా కనిపిస్తారు. నేను కలిసిన ఇతరులతో పోలిస్తే ఆయన ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు" అని తారా సుతారియా కొనియాడింది.

నటీమణులపై ఆ వివక్ష ఏంటి?

దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో యశ్‌ సరసన కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా హీరోయిన్లుగా నటించగా నయనతార కీలక పాత్ర పోషించింది. టాక్సిక్ సినిమాలో 'రెబెక్కా' అనే కీలక పాత్రలో తారా సుతారియా కనిపించింది.

తారా సుతారియా నటనకు మెప్పు

ప్రశాంతమైన స్వభావంతో తారా తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తీరును, నటన పట్ల ఆమెకున్న అంకితభావాన్ని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఇదివరకే ప్రశంసించారు. వెండితెరపై ఆమె ప్రదర్శించిన నటన ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

యూట్యూబర్స్‌కు నోటీసులు

ఇదిలా ఉంటే యశ్ మోస్ట్ ప్రెస్టేజీయస్ సినిమా టాక్సిక్‌కు ఘోరమైన నెగెటివ్ రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాలో యశ్ యాక్టింగ్, విజువల్స్ తప్పా చెప్పుకోడానికి గొప్పగా ఏ ఒక్కటి లేదని కామెంట్స్ వినిపించాయి. అలాగే, టాక్సిక్ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు ఇచ్చిన యూట్యూబర్స్‌కి ఇప్పటికే మూవీ టీమ్ నోటీసులు పంపడం కూడా హాట్ టాపిక్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe