Kiara Advani: యశ్‌కి కూడా పెళ్లయింది కదా మరి.. అతడు ఇలా చేయొచ్చా.. కియారానే ఎందుకు తిడుతున్నారు: టాక్సిక్ యాక్టర్ ప్రశ్న

Kiara Advani: టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన తబాహీ సాంగ్ లో కియారా అద్వానీ రెచ్చిపోయి నటించడంపై వస్తున్న ట్రోల్స్ పై ఆ మూవీ నటుడు ఘాటుగా స్పందించాడు. యశ్ ను పొగుడుతూ.. కియారాను తిట్టడమేంటి అని ప్రశ్నించాడు.

Published on: Jul 16, 2026, 15:59:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kiara Advani: కన్నడ రాకింగ్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic: A Fairy Tale for Grown-Ups) చుట్టూ వివాదాల తుఫాను ముసురుకుంది. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజైన 'తబాహి' (Tabaahi) వీడియో సాంగ్‌లో కియారా అద్వానీ నటించిన ఇంటెన్స్ రొమాంటిక్ సీన్స్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Kiara Advani: యశ్‌కి కూడా పెళ్లయింది కదా మరి.. అతడు ఇలా చేయొచ్చా.. కియారానే ఎందుకు తిడుతున్నారు: టాక్సిక్ యాక్టర్ ప్రశ్న
Kiara Advani: యశ్‌కి కూడా పెళ్లయింది కదా మరి.. అతడు ఇలా చేయొచ్చా.. కియారానే ఎందుకు తిడుతున్నారు: టాక్సిక్ యాక్టర్ ప్రశ్న

డబుల్ స్టాండర్డ్స్ పై హాలీవుడ్ నటుడి తీవ్ర ఆగ్రహం

ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్‌ఫుల్ వీడియో రిలీజ్ చేస్తూ ట్రోలర్ల తీరును తీవ్రంగా ఖండించారు. పాటలో హీరో యశ్ లుక్స్ ని మెచ్చుకుంటూ కామెంట్స్ సెక్షన్ ని ఫైర్ ఎమోజీలతో నింపేస్తున్న జనాలు, కియారా విషయంలో మాత్రం విపరీతమైన నెగెటివిటీ వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

పెళ్లై ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా ఇలాంటి సీన్స్ చేయడం ఏంటంటూ కియారా పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రాని కాదని యశ్ తో హనీమూన్ చేస్తోందా అంటూ కొందరు నెటిజన్లు పెట్టిన నీచమైన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"యశ్‌కి కూడా పెళ్లయింది కదా?".. షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఉన్న ద్వంద్వ నీతిని ఎండగడుతూ బెనెడిక్ట్ గారెట్ సంచలన కామెంట్స్ చేశారు. "యశ్ కూడా వివాహితుడే.. ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు రొమాంటిక్ సీన్స్ చేసినందుకు కేవలం నటిని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? మగాడికి ప్రశంసలు, ఆడదానికి నిందలా?" అని నిలదీశారు.

నటుల పని కేవలం స్క్రీన్ పై క్యారెక్టర్లను పండించడమేనని గుర్తుచేశారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ వృత్తిపరమైన యాక్టర్లని, కథ డిమాండ్ చేసినప్పుడు స్క్రీన్ పై లవ్, కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్ చేయడం వాళ్ల ప్రొఫెషన్‌లో భాగమని స్పష్టం చేశారు. పెళ్లై తల్లి అయినంత మాత్రాన ఒక నటి యాక్టింగ్ ఆపేయాలనడం మూర్ఖత్వమని ఆయన తేల్చి చెప్పారు.

పోస్టర్లు, ప్రమోషన్ల నుంచే మొదలైన వివాదాలు

'కేజీఎఫ్ 2' ఆల్‌టైమ్ బాక్స్ ఆఫీస్ రికార్డుల తర్వాత యశ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కావడంతో 'టాక్సిక్' పై ఇండస్ట్రీలో విపరీతమైన హైప్ ఉంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, ప్రమోషనల్ కంటెంట్ రిలీజైన ప్రతిసారీ వైలెంట్, బోల్డ్ కంటెంట్ కారణంగా వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు 'తబాహి' పాటలోని ప్రైవేట్ ఎమోషనల్ సీన్స్ సైతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ట్రోలింగ్స్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను తగ్గించకపోగా, ఆగస్ట్ 26న రాబోయే థియేట్రికల్ రిలీజ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

ఈ కన్నడ-ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అద్వానీతో పాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీస్ హుమా ఖురేషి, తారా సుతారియా, కన్నడ నటి రుక్మిణి వసంత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఒక మహిళా డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్న ఈ డార్క్ డ్రామాలో యశ్ కంప్లీట్ మేకోవర్‌తో సరికొత్త మాస్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More