...
...
Next Story

Trisha Emotional: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిష.. వీడియో వైరల్!

Trisha Emotional During TVK Vijay CM Swearing: తమిళనాడు ముఖ్యమంత్రిగా నటుడు, రాజకీయ నేత దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో విజయ్ ప్రసంగిస్తుండగా ఆయన స్నేహితురాలు, నటి త్రిష కంటతడి పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Published on: May 10, 2026, 21:06:46 IST
Advertisement

Trisha Emotional During Thalapathy Vijay CM Swearing: తమిళ రాజకీయాల్లో ఒక నూతన శకం మొదలైంది. వెండితెరపై దళపతిగా వెలిగిన విజయ్, ఇప్పుడు కోట్లాది మంది తమిళ ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆదివారం (మే 10) జరిగిన ఈ చారిత్రాత్మక విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అభిమానుల కోలాహలం, ప్రముఖుల సమక్షంలో కనులపండువగా సాగింది.

కన్నీళ్లు పెట్టుకున్న త్రిష

తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిష.. వీడియో వైరల్!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న త్రిష.. వీడియో వైరల్!

అయితే, దళపతి విజయ్ ప్రమాణ స్వీకారంలో రాజకీయ అంశాల కంటే ఎక్కువగా హీరోయిన్ త్రిష కృష్ణన్ చూపిన హావభావాలే అందరి దృష్టిని ఆకర్షించాయి. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు త్రిష తన తల్లి ఉమా కృష్ణన్‌తో కలిసి నీలి రంగు చీరలో హాజరయ్యారు.

టీవీకే పార్టీ అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగాన్ని చేస్తున్న సమయంలో ప్రేక్షకుల వరుసలో కూర్చున్న త్రిష ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ మాట్లాడుతుండగా త్రిష కళ్లు చెమ్మగిల్లడం, కన్నీళ్లను తుడుచుకుంటూనే చిరునవ్వు చిందించడం అక్కడున్న కెమెరాల్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతకుముందు స్టేడియానికి చేరుకున్నప్పుడు మీడియా ప్రతినిధులు "ఈ రోజు తమిళనాడుకు పెద్ద రోజు కదా?" అని అడగగా, "అవును.. చాలా సంతోషంగా ఉంది" అని హీరోయిన్ త్రిష బదులిచ్చారు.

విజయ్ తొలి ప్రసంగం: "నేనేం దైవదూతను కాదు"

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తన తొలి ప్రసంగంలో ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. "తమిళనాడులో సరికొత్త పాలనను అందించేందుకు అందరం కలిసి నడుద్దాం. ఇది లౌకికవాదం, సామాజిక న్యాయంతో కూడిన కొత్త శకానికి ఆరంభం" అని దళపతి విజయ్ ప్రకటించారు.

చాలా కాలంగా విజయ్, త్రిషల మధ్య ఏదో ఉందనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో సాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి గిల్లి, తిరుపాచి, కురువి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సుదీర్ఘ విరామం తర్వాత 'లియో' చిత్రంలో భార్యాభర్తలుగా కనిపించి విజయ్-త్రిష ప్రేక్షకులను మెప్పించారు.

మరోవైపు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చారని, త్రిషతో అనుబంధం వల్లే ఈ విభేదాలు వచ్చాయని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇటు విజయ్, అటు త్రిష అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ తల్లిని త్రిష ఆత్మీయంగా పలకరించడం కూడా పలు చర్చలకు తావిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

నటుడు, రాజకీయ నేత విజయ్ (TVK అధినేత) తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2. విజయ్ ప్రమాణ స్వీకార వేడుక ఎక్కడ జరిగింది?

చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక నిర్వహించారు.

3. విజయ్ ప్రమాణ స్వీకారంలో నటి త్రిష ఎందుకు వార్తల్లో నిలిచారు?

విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో త్రిష భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వార్తల్లో నిలిచారు.

4. విజయ్, త్రిష కలిసి నటించిన సినిమాలు ఏవి?

వీరిద్దరూ గిల్లి, తిరుపాచి, ఆది, కురువి, లియో వంటి చిత్రాల్లో జంటగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks