Trisha Krishnan Controversies: సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉంటే.. అన్ని వివాదాలు చుట్టుముట్టడం సహజం. హీరోయిన్ త్రిష విషయానికి వస్తే ఆమె కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా దూసుకుపోతుందో, ఆమె పేరుతో వచ్చే కాంట్రవర్సీలు కూడా అంతే స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
ట్రెండింగ్ లో త్రిష

గత కొంతకాలంగా త్రిష కృష్ణన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె పేరు ట్రెండింగ్ లోకి వచ్చింది. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ చెన్నై శశి, వివాదాలను సైతం అంతే ధీటుగా ఎదుర్కొంటూ వస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగిపోవడానికి గల ప్రధాన కారణాలు, ఆమె కెరీర్‌లోని కొన్ని సంచలన వివాదాలు ఇక్కడున్నాయి.
‘జారా’ బ్రాండ్ వివాదం
ప్రస్తుతం ఇంటర్నెట్‌లో త్రిష పేరు ట్రెండ్ అవ్వడానికి తాజా కారణం ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ ‘జారా’ (Zara) తో ముడిపడి ఉంది. ఈ బ్రాండ్ నుంచి దుస్తులను త్రిష ఆర్డర్ చేసింది. డెలివరీ అయిన ఆ దుస్తులను ఓపెన్ చేస్తే ఒకటే చెమట కంపు. దీంతో ఈ బ్రాండ్ పై త్రిష ఫైర్ అయింది. ఇలా మూడో సారి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దళపతి విజయ్ - సంగీత విడాకుల రూమర్స్
త్రిష కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ కాలం వేధించిన, ఇప్పటికీ వేధిస్తున్న వివాదం కోలీవుడ్ స్టార్, ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ (Vijay) తో ఆమెకున్న అనుబంధం. విజయ్, త్రిషల కాంబినేషన్‌లో గిల్లి, తిరుపాచి, కురువి మరియు ఇటీవల వచ్చిన 'లియో' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.
విజయ్, త్రిష మధ్య స్క్రీన్ కెమిస్ట్రీని దాటి ఏదో ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. తన భర్తకు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించింది. ఆ హీరోయిన్ త్రిషనే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
విజయ్ బర్త్‌డే పోస్ట్
{{/usCountry}}విజయ్, త్రిష మధ్య స్క్రీన్ కెమిస్ట్రీని దాటి ఏదో ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రచ్చ మొదలైంది. తన భర్తకు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించింది. ఆ హీరోయిన్ త్రిషనే అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.
విజయ్ బర్త్‌డే పోస్ట్
{{/usCountry}}గత నెల (జూన్ 22) విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష పెట్టిన ఒక పోస్ట్ మంటల్లో నెయ్యి పోసినట్లయింది. విజయ్‌తో కేక్ కట్ చేయిిస్తూ కలిసి దిగిన ఓ ఫొటోను త్రిష సోషల్ మీడియాలో సేర్ చేసింది. ఈ ఒక్క పోస్ట్‌తో కోలీవుడ్ మీడియా మొత్తం షాక్‌కు గురైంది. రూమర్స్‌ను లైట్ తీసుకోవడం పక్కన పెడితే, త్రిష ఏకంగా ఆ రూమర్స్‌ను మరింత పెంచేలా ఈ పిక్ పోస్ట్ చేసిందంటూ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది.
గతంలోనూ ఇలాగే
త్రిష కెరీర్‌లో ఇవే మొదటి వివాదాలు కావు. గతంలో కూడా ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచింది.
- PETA - జల్లికట్టు వివాదం: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టును నిషేధించాలని కోరిన PETA సంస్థకు మద్దతు ఇచ్చినందుకు తమిళ ప్రజలు త్రిషను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె ఇంటి ముట్టడికి కూడా ప్రయత్నించడంతో ఆమె ఆ సంస్థ నుంచి తప్పుకుంది.
- మన్సూర్ అలీ ఖాన్ కామెంట్స్: ఇటీవల నటుడు మన్సూర్ అలీ ఖాన్.. త్రిషపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వివాదంలో పరిశ్రమ మొత్తం త్రిషకు మద్దతుగా నిలిచింది.
- లీక్డ్ ఫోటోల వివాదం: కెరీర్ ప్రారంభంలో, ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన ఫోటోలు లీక్ అయినప్పుడు కూడా త్రిష తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.
వరుస సినిమాలతో
వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా కెరీర్ పరంగా మాత్రం త్రిష ఎక్కడా తగ్గడం లేదు. ఒకవైపు చిరంజీవి సరసన ‘విశ్వంభర’.. మరోవైపు అజిత్, కమల్ హాసన్ వంటి టాప్ స్టార్ల సినిమాలతో బిజీగా ఉంటూ.. కాంట్రవర్సీలకు తన సక్సెస్‌తోనే సమాధానం చెబుతోంది ఈ లేడీ సూపర్ స్టార్.