...
...
Next Story

Trisha Vijay: విజ‌య్‌తో రిలేష‌న్‌షిప్ పుకార్లు.. పెళ్లికూతురిలా ముస్తాబైన త్రిష‌.. లేటెస్ట్ పోస్ట్ వైర‌ల్‌

Trisha Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, త్రిష మధ్య ఏదో ఉందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. వీళ్ల రిలేషన్ షిప్ పై కోలీవుడ్ కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లికూతురిలా ముస్తాబై త్రిష పెట్టిన లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది.

Published on: Mar 15, 2026, 05:48:31 IST
Advertisement

ఇప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష పేరు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులగా ఆమె ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అందుకు కారణం ఆమె చేసిన సినిమాలు కాదు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తో త్రిష రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లే కారణం. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురిలా ముస్తాబైన త్రిష సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

త్రిష పోస్ట్

త్రిష (instagram-trishakrishnan)
త్రిష (instagram-trishakrishnan)

త్రిష తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. పెళ్లి కూతురిలా చీరకట్టులో, మెడ నిండా నగలతో త్రిష మెరిసిపోయింది. ఈ లుక్ లో ఆమె ఎంతో క్యూట్ గా కనిపించింది. చేతికి కూడా బంగారు గాజులు వేసుకుంది. ఓ జువెలరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా త్రిష ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది.

విజయ్ తో రిలేషన్ షిప్

విజయ్ కు ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలు చేసిన సంగీత తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత విజయ్ తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని మరో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు విజయ్, త్రిష కలిసి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.

కన్ఫామ్ చేశారంటూ

ఓ వైపు భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కితే, మరోవైపు త్రిషతో కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు విజయ్ వెళ్లడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విజయ్, త్రిష తమ రిలేషన్ షిప్ ను కన్ఫామ్ చేసినట్లేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తన పర్సనల్ లైఫ్ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల తన పార్టీ తమిళగ వెట్రి కళగం మీటింగ్ లో విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

త్రిష కౌంటర్

ఇక తనపై లేని పోని మాటలతో రెచ్చిపోయిన పార్థిబన్ కు త్రిష కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరకు పార్థిబన్ సారీ చేప్పాడు. మరోవైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన పేరులో ‘వి’ అక్షరం తీసేసి ‘ఎస్’ అక్షరం చేర్చుకున్నాడనే టాక్ కూడా సంచలనంగా మారింది. తల్లి సంగీతకు సపోర్ట్ గా సంజయ్ అలా చేశాడని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe