Thaman: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం' (హౌజ్ నెంబర్ 47 - #AK47). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘మాలా వచ్చా చూడు’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తమన్ పై ట్రోల్స్

ఆదర్శ కుటుంబం మూవీ నుంచి రెండో పాటగా ‘మాలా వచ్చా చూడు’ లిరికల్ సాంగ్ రీసెంట్ గా రిలీజైంది. నివేదా పేతురాజ్ గ్లామర్, వెంకీ మామ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే, విజువల్స్ పరంగా ఈ సాంగ్ అలరిస్తున్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్యూన్ మాత్రం వివాదంలో చిక్కుకుంది.
సొంత పాటనే కాపీ కొట్టాడా?
ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే నెటిజన్లు ఇందులోని మ్యూజిక్ బీట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ను పసిగట్టారు. గతంలో తమన్ అందించిన బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ 'ప్రతి రోజూ పండగే' చిత్రంలోని 'ఓ బావ' సాంగ్ ట్యూన్‌ను యాజిటీజ్‌గా దించేసాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీసం ట్యూన్ మార్చడానికి కూడా ట్రై చేయకుండా తన సొంత పాటనే తమన్ ఇక్కడ రీసైకిల్ చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో రెండు పాటల క్లిప్పింగ్స్‌ను పక్కపక్కన పెట్టి మీమ్స్, ట్రోల్స్‌తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
ఆదర్శ కుటుంబం కథేంటి?
టైటిల్‌కు తగ్గట్టే ఇది ఒక సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. బయటకు ఎంతో పర్ఫెక్ట్గా, ఆదర్శంగా కనిపించే 'హౌజ్ నెంబర్ 47' అనే ఇంట్లోని ఒక కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఊహించని ఒక సంఘటన వల్ల ఆ కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు ఎలా బయటపడ్డాయి, ఆదర్శంగా కనిపించే ముసుగు వెనుక ఉన్న అసలు నిజాలను కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని మలిచారు.
{{/usCountry}}టైటిల్‌కు తగ్గట్టే ఇది ఒక సంపూర్ణమైన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. బయటకు ఎంతో పర్ఫెక్ట్గా, ఆదర్శంగా కనిపించే 'హౌజ్ నెంబర్ 47' అనే ఇంట్లోని ఒక కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఊహించని ఒక సంఘటన వల్ల ఆ కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలు ఎలా బయటపడ్డాయి, ఆదర్శంగా కనిపించే ముసుగు వెనుక ఉన్న అసలు నిజాలను కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని మలిచారు.
{{/usCountry}}ఇందులో వెంకటేశ్ తన ఇంటికి సంబంధించిన పనులన్నీ స్వయంగా చేసుకునే 'చిట్టిబాబు' అనే బాధ్యతాయుతమైన కుటుంబ పెద్ద పాత్రలో కనిపిస్తున్నారు. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు డార్క్ అండర్ టోన్ కలిగిన సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
వరుస వాయిదాలు.. రిలీజ్ ఎప్పుడు?
మొదట ఈ ఆదర్శ కుటుంబం సినిమాను 2026 సమ్మర్ రేసులో నిలపాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 2న, అనంతరం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీవ్ర జాప్యం జరగడం వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.
ప్రస్తుతం ఈ సినిమాను అక్టోబర్ 30, 2026 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. నిర్మాత నాగవంశీ ఇటీవల స్పందిస్తూ.. అక్టోబర్ 21 లేదా 22న ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని, అదే వేదికపై హీరో వెంకటేశ్‌తోనే అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేయిస్తామని క్లారిటీ ఇచ్చారు.