TRP List: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ 17వ వారం టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. గతంతో పోలిస్తే రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఇవి మరింత పతనమయ్యాయి. కానీ ఎప్పటిలాగే టాప్ 10 సీరియల్స్ లో పెద్దగా మార్పులేమీ లేవు. టాప్ 2 తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలోని టాప్ సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఇందులో చూద్దాం.
స్టార్ మా: తిరుగులేని 'కార్తీక దీపం-2'

స్టార్ మా ఛానెల్‌లో మెజారిటీ సీరియల్స్ అద్భుతమైన రేటింగ్స్‌తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టాప్ 5 స్థానాల్లో ఈ ఛానెల్ సీరియల్స్ ఉండటం విశేషం.
స్టార్ మా టాప్ రేటింగ్స్ (U+R)
కార్తీక దీపం 2 - 11.06
ఇల్లు ఇల్లాలు పిల్లలు - 10.60
గుండె నిండా గుడి గంటలు - 10.04
ఇంటింటి రామాయణం - 9.55
పొదరిల్లు - 8.46
నువ్వు లేక నేను లేను - 7.23
కార్తీక దీపం 2 సీరియల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నా.. గతంతో పోలిస్తే రేటింగ్ చాలా తక్కువగా నమోదైంది. ఒక దశలో 15కుపైగా రేటింగ్ సాధించిన ఈ సీరియల్ ఇప్పుడు 11కు పరిమితమైంది. అలాగే మిగిలిన సీరియల్స్ రేటింగ్స్ కూడా తగ్గిపోయాయి.
జీ తెలుగు: 'జయం'తో మొదలైన జోరు
జీ తెలుగులో కొన్ని సీరియల్స్ స్థిరమైన రేటింగ్స్‌ను సాధిస్తున్నాయి. స్టార్ మాతో పోలిస్తే రేటింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఆడియన్స్‌ను ఈ ఛానెల్ సంపాదించుకుంది. ఈ ఛానెల్లో జయం సీరియల్ కు అత్యధికంగా 6.18 రేటింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో చామంతి (5.84), జగద్ధాత్రి (5.79), మేఘ సందేశం (4.77), కలవారి కోడలు కనక మహాలక్ష్మి (3.89) నిలిచాయి.
మొత్తంగా చూస్తే టాప్ 10లో తొలి ఆరు స్థానాల్లో స్టార్ మా సీరియల్సే ఉండగా.. చివరి నాలుగు స్థానాల్లో మాత్రమే జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. అవి కూడా క్రమంగా రేటింగ్స్ తగ్గిపోతూ నిరాశపరుస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}మొత్తంగా చూస్తే టాప్ 10లో తొలి ఆరు స్థానాల్లో స్టార్ మా సీరియల్సే ఉండగా.. చివరి నాలుగు స్థానాల్లో మాత్రమే జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. అవి కూడా క్రమంగా రేటింగ్స్ తగ్గిపోతూ నిరాశపరుస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}1. ఈ ఏడాది 17వ వారం నంబర్ వన్ తెలుగు సీరియల్ ఏది?
'కార్తీక దీపం 2' (స్టార్ మా) 11.06 రేటింగ్‌తో ఈ వారం నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
2. జీ తెలుగులో టాప్ సీరియల్ ఏది?
జీ తెలుగులో 'జయం' సీరియల్ 6.18 రేటింగ్‌తో టాప్‌లో ఉంది.
3. 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ రేటింగ్ ఎంత?
ఈ సీరియల్ 10.60 రేటింగ్‌తో స్టార్ మాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.