...
...
Next Story

OTT Kritika Kamra: ఓటీటీ ప్రపంచంలో బుల్లితెర బ్యూటి సెన్సేషన్.. సినిమా కెరీర్ జూదం లాంటిందన్న క్రితికా కమ్రా!

Kritika Kamra On Matka King OTT Release: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిపుల్ బుల్లితెర బ్యూటీ క్రితికా కమ్రా. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ నటించిన ఓటీటీ సిరీస్ మట్కా కింగ్‌లో క్రితికా కమ్రా కీలక పాత్ర పాత్ర చేసింది. మట్కా కింగ్ ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో తాజాగా క్రితికా కమ్రా కామెంట్స్ చేసింది.

Published on: Apr 16, 2026 06:37 AM IST
Advertisement

Kritika Kamra On Matka King OTT Streaming: బుల్లితెరపై తన నటనతో మెప్పించిన క్రితికా కమ్రా, ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డ్ విన్నర్ నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కిన మట్కా కింగ్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో క్రితికా కమ్రా కీలక పాత్ర పోషించింది.

బాంబే మట్కా సామ్రాజ్యం.. అసలు కథ ఇదీ!

ఓటీటీ ప్రపంచంలో బుల్లితెర బ్యూటి సెన్సేషన్.. సినిమా కెరీర్ జూదం లాంటిందన్న క్రితికా కమ్రా!
ఓటీటీ ప్రపంచంలో బుల్లితెర బ్యూటి సెన్సేషన్.. సినిమా కెరీర్ జూదం లాంటిందన్న క్రితికా కమ్రా!

ముంబై (అప్పటి బాంబే) వీధుల్లో ఒకప్పుడు రాజ్యమేలిన 'మట్కా' జూదం నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ రూపుదిద్దుకుంది. వాస్తవానికి రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ వంటి మట్కా కింగ్‌ల జీవితాల నుంచి ప్రేరణ పొందినా, ఇందులో విజయ్ వర్మ పోషించిన 'బ్రిజ్ భట్టీ' అనే కల్పిత పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.

ఈ వెబ్ సిరీస్ గురించి కృతికా కమ్రా మాట్లాడుతూ.. "మట్కా ప్రపంచం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముంబైలో పెరగకపోవడం వల్ల నాకు ఈ మట్కా సంస్కృతి గురించి ముందే తెలియదు. స్క్రిప్ట్ వచ్చాక దీనిపై లోతుగా రీసెర్చ్ చేశాను. ఒక ప్రేక్షకురాలిగా నన్ను ఈ కథ థ్రిల్ చేసింది కాబట్టే, కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మాను" అని పేర్కొన్నారు.

నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో ఛాన్స్

'సైరాట్' వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన జాతీయ అవార్డు గ్రహీత నాగ్‌రాజ్ మంజులే ఈ సిరీస్‌తో లాంగ్-ఫార్మాట్ (వెబ్ సిరీస్) ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనతో పని చేయడం ప్రతి నటుడి కల అని క్రితికా చెప్పుకొచ్చారు.

"గత కొన్నేళ్లుగా నేను క్రాఫ్ట్ మీద పట్టున్న దర్శకులతో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అప్పుడే నటిగా నాలో పరిణతి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం నేను రెండుసార్లు ఆడిషన్ ఇచ్చాను. మొదటిసారి నాగ్‌రాజ్ సర్ సంతృప్తి చెందలేదు, కానీ రెండోసారి నా శ్రమ చూసి సెలక్ట్ చేశారు" అని కృతిగా కమ్రా గుర్తు చేసుకున్నారు.

గుల్రుఖ్ దిబాష్: కథను మలుపు తిప్పే పాత్ర

"కేవలం హీరో పక్కన ఉండే పాత్రలు కాకుండా, కథను ముందుకు నడిపే మహిళా పాత్రల కోసం నేను ఎప్పుడూ అన్వేషిస్తుంటాను. ఈ కథలో గుల్రుఖ్ పాత్ర అలాంటిదే. విజయ్ వర్మతో నా కెమిస్ట్రీ కంటే, ఆ గ్యాంబ్లింగ్ గేమ్‌లో నా పాత్ర పోషించే రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని క్రితికా కమ్రా వివరించారు.

రిస్క్ తీసుకుంటేనే ఫలితం!

సినిమా కెరీర్ అనేది ఒక పక్కా మట్కా గేమ్ (జూదం) లాంటిదని క్రితికా అభిప్రాయపడ్డారు. "జీవితంలో అప్పుడప్పుడు రిస్క్ బెట్స్ వేయాల్సిందే. ఒక్క సినిమాతోనే నా జీవితం మారిపోతుందని నేను కూర్చోను. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను. కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కానీ ఇంటికి వెళ్లేటప్పుడు విజేతగానే వెళ్లాలన్నది నా తపన. రిజెక్షన్స్ ఎదురైనప్పుడు బాధగా అనిపిస్తుంది, కానీ అంతకంటే మంచి అవకాశం మనకోసం వేచి చూస్తుందని నమ్ముతాను" అని క్రితికా కమ్రా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఇదిలా ఉంటే, ఏప్రిల్ 17 నుంచి మట్కా కింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో మట్కా కింగ్ ఓటీటీ రిలీజ్ అవనుంది. హిందీతోపాటు తెలుగు భాషలో కూడా మట్కా కింగ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe