...
...
Next Story

TV Actress: రెడ్ బుల్‌తోపాటు ఫ్రీగా బొద్దింకను కూడా పంపారు, అది ఇల్లంతా తిరుగుతోంది- అసలైన సింగంకు సీరియల్ నటి ఫిర్యాదు

Shweta Tiwari Complaint To Tukaram Mundhe: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన రెడ్ బుల్ క్యాన్‌తో పాటు బొద్దింక వచ్చిందంటూ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారీ సోషల్ మీడియాలో సరదాగా ఫిర్యాదు చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ అసలైన సింగంగా పేరు తెచ్చుకున్న తుకారాం ముండేకు ఫిర్యాదు చేశారు.

Published on: Aug 21, 2026, 12:33:47 IST
Advertisement

Shweta Tiwari Complaint To Tukaram Mundhe: ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలు, గ్రోసరీ ఆర్డర్ చేసే వినియోగదారులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారీకి కూడా ఇలాంటి దారుణమైన అనుభవమే ఎదురైంది.

ఆర్డర్‌తో పాటు వచ్చిన బొద్దింక.. వీడియో వైరల్!

రెడ్ బుల్‌తోపాటు ఫ్రీగా బొద్దింకను కూడా పంపారు, అది ఇల్లంతా తిరుగుతోంది- అసలైన సింగంకు సీరియల్ నటి ఫిర్యాదు
రెడ్ బుల్‌తోపాటు ఫ్రీగా బొద్దింకను కూడా పంపారు, అది ఇల్లంతా తిరుగుతోంది- అసలైన సింగంకు సీరియల్ నటి ఫిర్యాదు

క్విక్ కామర్స్ యాప్ 'ఇన్‌స్టామార్ట్' (Instamart) ద్వారా ఆర్డర్ చేసిన డ్రింక్ క్యాన్‌తో పాటు ఒక బొద్దింక ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని శ్వేతా తివారీ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

రెడ్ బుల్ క్యాన్‌తోపాటు బొద్దింక

ఇన్‌స్టామార్ట్ నుంచి ఆర్డర్ చేసిన రెడ్ బుల్ క్యాన్ ప్యాకింగ్‌తో పాటు ఒక చిన్న బొద్దింక వచ్చిందని, అది ఇల్లంతా తిరుగుతోందని వీడియోలో చూపించారు శ్వేతా తివారీ. "మేము ఇన్‌స్టామార్ట్ నుంచి రెడ్ బుల్ ఆర్డర్ చేస్తే, దానితో పాటు ఉచితంగా ఒక బొద్దింక కూడా వచ్చింది. అది ఇప్పుడు ఇల్లంతా పరుగెడుతోంది" అని శ్వేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

సరదాగా నవ్వుతూ అధికారుల దృష్టికి

ఆ సమయంలో ఇంట్లోని వారు దానిని కొట్టడానికి ప్రయత్నించగా శ్వేత వారిని వారించారు. సరదాగా నవ్వుతూనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు శ్వేతా తివారీ.

'అసలైన సింగం' తుకారాం ముండేకు ఫిర్యాదు

ఆహార భద్రత విషయంలో రాజీ పడని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండేను శ్వేతా తివారీ ఈ వీడియోలో టాగ్ చేశారు. సోషల్ మీడియాలో 'అసలీ సింగం'గా పేరు తెచ్చుకున్న ముండేను ఉద్దేశించి మాట్లాడారు.

ఇంటికి బొద్దింకలను పంపుతున్నారు

మహారాష్ట్ర ఎఫ్‌డిఏ కమిషనర్‌గా తుకారాం ముండే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆహార సంస్థలు, హోటళ్లు, డెలివరీ గోదాములపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

రూ. 25 లక్షల విలువైన నిషేధిత పదార్థాలు సీజ్

ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఐదు ప్రముఖ హోటళ్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, రూ.25 లక్షల విలువైన నిషేధిత పదార్థాలు, కలుషిత పాలు, డైరీ ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. శ్వేతా తివారీ చేసిన ఈ ఫిర్యాదుపై ఎఫ్‌డిఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నటి శ్వేతా తివారీకి ఎదురైన సమస్య ఏమిటి?

ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన రెడ్ బుల్ క్యాన్‌తో పాటు ప్యాకింగ్‌లో బొద్దింక రావడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు.

2. శ్వేతా తివారీ ఎవరికి ఫిర్యాదు చేశారు?

ఫుడ్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్న మహారాష్ట్ర ఎఫ్‌డిఏ కమిషనర్ తుకారాం ముండేను టాగ్ చేస్తూ ఆమె వీడియో పోస్ట్ చేశారు.

3. మహారాష్ట్ర ఎఫ్‌డిఏ కమిషనర్ తుకారాం ముండే ఎందుకు వార్తల్లో నిలిచారు?

ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లు, డెలివరీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆయన 'అసలీ సింగం'గా గుర్తింపు పొందారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe