డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను థియేటర్లలో ఎంటర్ టైన్ చేసిన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ఆ రెండు సినిమాలే బైసన్, డ్యూడ్. బైసన్ సినిమాలో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో. మరోవైపు డ్యూడ్ మూవీలో ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రదర్శన చేశాయి.
ఒకే రోజు రిలీజ్

తమిళ సినిమాలు బైసన్, డ్యూడ్ రెండు ఒకే రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అక్టోబర్ 17న థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి. బైసన్ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. దీనికి మారి సెల్వరాజ్ డైరెక్టర్. డ్యూడ్ ఏమో న్యూ ఏజ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చింది. దీనికి కీర్తిశ్వరణ్ డైరెక్టర్.
ఒకే ఓటీటీలోకి
బైసన్, డ్యూడ్ రెండు తమిళ సినిమాలు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇవి త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. సౌత్ సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్ ఇక్కడ చిత్రాల ఓటీటీ రైట్స్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ క్రమంలోనే బైసన్, డ్యూడ్ సినిమాల ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.
ఓటీటీలోకి ఎప్పుడంటే?
బైసన్, డ్యూడ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఏదో తెలిసింది కానీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సాధారణంగా సౌత్ సినిమాలు థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే బైసన్, డ్యూడ్ వచ్చే వారం ఓటీటీ డెబ్యూ చేసే అవకాశముంది.
తెలుగులోనూ
తమిళ సినిమాలైన బైసన్, డ్యూడ్ తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ డబ్ అయి థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.
{{/usCountry}}తమిళ సినిమాలైన బైసన్, డ్యూడ్ తెలుగులోనూ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానున్నాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలు తెలుగులోనూ డబ్ అయి థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.
{{/usCountry}}థియేటర్లో బైసన్, డ్యూడ్ ఒకే రోజు రిలీజై పోటీపడ్డాయి. మరి ఓటీటీలోనూ ఒకే రోజు రిలీజ్ అవుతాయా? అన్నది చూడాలి. ఈ రెండింటి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒకటే. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఈ రెండు సినిమాలను ఒకే రోజు స్ట్రీమింగ్ కు తీసుకొస్తుందా? లేదా మధ్యలో ఒకట్రెండు రోజులు గ్యాప్ తీసుకుంటుందా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.