...
...
Next Story

Udaya Bhanu OTT: వందల, వేల మెసేజ్‌లు వస్తున్నాయి, సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా: ఓటీటీ సిరీస్‌పై ఉదయభాను

Udaya Bhanu About OTT Telugu Series: టాలీవుడ్ యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉదయభాను ఇటీవల యాక్ట్ చేసిన తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ ఓటీటీ సిరీస్‌పై ఇటీవల ఉదయభాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 10, 2026, 14:37:37 IST
Advertisement

తెలుగులో యాంకర్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయభాను చాలా కాలం తర్వాత వరుసగా సినీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అవుతున్నారు. త్రిబాణధారి బార్బరిక్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను రీసెంట్‌గా తెలుగు ఓటీటీ సిరీస్‌తో డిజిటల్ వేదికపై అలరించారు.

ఉదయ భానుతోపాటు రాజీవ్ కనకాల

వందల, వేల మెసేజ్‌లు వస్తున్నాయి, సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా: ఓటీటీ సిరీస్‌పై ఉదయభాను
వందల, వేల మెసేజ్‌లు వస్తున్నాయి, సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా: ఓటీటీ సిరీస్‌పై ఉదయభాను

ఉదయ భాను నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఉదయ భానుతోపాటు రాజీవ్ కనకాల, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఓటీటీ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ స్ట్రీమింగ్

ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఓటీటీ సక్సెస్ ఈవెంట్‌కు హాజరైన ఉదయభాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంత ఆనందాన్ని ఇస్తుందా?

ఉదయభాను మాట్లాడుతూ .. "ఓ సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందా? అని నాకు ఇప్పుడు తెలుస్తోంది. ఈ ఓటీటీ సిరీస్‌కు అందరూ వందకు వంద శాతం ఎఫెర్ట్ పెట్టారు. మా సిరీస్ గురించి, మా నటన గురించి వందల, వేల మెసెజ్‌లు వస్తున్నాయి" అని అన్నారు.

జీ5 ఓటీటీకి థ్యాంక్స్

"రెబెకా పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ కనెక్ట్ అయింది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ సిరీస్ సీక్వెల్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. రాజీవ్ కనకాల సత్తాకు తగ్గ పాత్ర ఇన్ని రోజులకు వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇంత మంచి సక్సెస్‌ను ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్" అని తన స్పీచ్ ముగించారు ఉదయ భాను.

సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్‌పై

ఇదిలా ఉంటే, ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన వెబ్ సిరీస్ ఇది. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు కథలోకి వెళితే.. కూతురు స్వాతిని పుట్టినప్పటి నుంచి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు తండ్రి.

హాస్టల్‌లో ఉంటూ

స్వాతి బాగా చదవుకును హైదరాబాద్‌లో ఉద్యోగం సంపాదించి హాస్టల్‌లో ఉంటుంది. ఓ రోజు స్వాతి మిస్ అవుతుంది. స్వాతి మిస్సింగ్ కేసును పోలీస్ ఆఫీసర్ రెబెకా డీల్ చేస్తుంది.

జీ5 ఓటీటీలో

ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో రెబెకా తెలుసుకుంది ఏంటీ?, స్వాతి కోసం తండ్రి ఎంత దూరం వెళ్లాడు? అసలు హాస్టల్‌లో, స్వాతి జీవితంలో జరిగింది ఏంటీ? అనేది తెలియాలంటో జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతోన్న ఈ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు సిరీస్ చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe