...
...
Next Story

Udhayanidhi Trisha: త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్.. సీఎం నోరువిప్పడం లేదంటూ విజయ్‌పైనా విమర్శలు!

Udhayanidhi Stalin Double Meaning Comments On Trisha: తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం విజయ్‌పైనా కూడా స్టాలిన్ విమర్శలు చేశారు. కావేరి జలాల నిరసన సభలో ఆయన మాటలపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Published on: Aug 4, 2026, 09:39:12 IST
Advertisement

Udhayanidhi Stalin Double Meaning Comments On Trisha: సినిమా, రాజకీయం రెండూ కలగాపులగంగా మారే తమిళనాడు రాజకీయాల్లో మరో వివాదం రాజేసుకుంది. తంజావూరులో నిర్వహించిన కావేరి నీటి సమస్య సభలో తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

త్రిష పేరు లాగుతూ

త్రిషపై ఉదయని నిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్.. సీఎం నోరువిప్పడం లేదంటూ విజయ్‌పైనా విమర్శలు!
త్రిషపై ఉదయని నిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్.. సీఎం నోరువిప్పడం లేదంటూ విజయ్‌పైనా విమర్శలు!

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు దళపతి విజయ్‌లను ఉద్దేశించి మాట్లాడే క్రమంలో, హీరోయిన్ త్రిష పేరును లాగుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

సభలో ఉదయనిధి ఏమన్నారు?

కావేరి జలాల వివాదంపై ఉదయనిధి వేదికపై నుంచి ప్రసంగిస్తున్నారు. "మన సీఎం కావేరి జలాల అంశంపై నోరు విప్పడం లేదు. డీఎంకే నాయకులపై అబద్ధపు కేసులు పెట్టడంలోనే ఆయన నిమగ్నమయ్యారు" అని విమర్శిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సభలోని ప్రేక్షకుల నుంచి ఎవరో నటి త్రిష పేరును గట్టిగా అరిచారు.

నీళ్లు అయితే రావాలి

సభికుల వైపు చూసి నవ్విన ఉదయనిధి స్టాలిన్ "నీళ్లు వస్తున్నాయో లేదో తెలీదు కానీ, ఆ నీళ్లు అయితే రావాలి.. నేను చెప్పేది కావేరి నీళ్ల గురించి" అంటూ డబుల్ మీనింగ్‌తో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారు, సభకు వచ్చిన కొందరు నవ్వుతూ ఈలలు వేసినప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

నెటిజన్లు, రాజకీయ నేతల తీవ్ర ఆగ్రహం

"ప్రజాక్షేత్రంలో ఉండే ఒక నాయకుడు మహిళల పట్ల ఇలాంటి భాష ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రగతిశీల భావాలు ఉన్నాయని చెప్పుకునే ఉదయనిధి అసలు నైజం ఇదేనా?", "వాళ్ల అమ్మ, కూతురు చాలా గర్వంగా ఫీల్ అవుతారు" అని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిలదీస్తున్నారు.

త్రిషను లక్ష్యంగా చేసుకోవడం ఇది తొలిసారి కాదు

స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నప్పటి నుంచి, త్రిషను దీనిలోకి లాగడం ఇది మొదటిసారి కాదు. గతంలో తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు 'త్రిష ఇల్లు వదిలి బయటకు రావాలి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

స్పందించని త్రిష, విజయ్

అప్పట్లో త్రిష లీగల్ టీమ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష గానీ, నటుడు విజయ్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి, బహిరంగ సభలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks