...
...
Next Story

Ullipoola Song Lyrics: ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్-అచ్చమైన తెలంగాణ పదాలతో ఉల్లిపూల పాట-లిరిక్స్ చూసి పాడేయండి!

Ullipoola Song Lyrics: ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్న ఇడుపు కాయితం మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ మూవీ నుంచి రిలీజైన శ్రీలత, గడప లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు రిలీజైన ‘ఉల్లిపూల’ సాంగ్ అయితే ఈ మూవీపై హైప్ మరింత పెంచేలా ఉంది. మీరూ ఈ లిరిక్స్ చూసి పాడేయండి.

Published on: Nov 28, 2026, 21:46:00 IST
Advertisement

Ullipoola Song Lyrics: పక్కా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కుతున్న మూవీ ‘ఇడుపు కాయితం’. ఇందులో ప్రియదర్శి, నాగ దుర్గ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఉల్లిపూల’ సాంగ్ రిలీజైంది. హుషారైన బీట్ తో, పక్కా తెలంగాణ జానపద లిరిక్స్ తో ఈ సాంగ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.

ఉల్లిపూల సాంగ్ లిరిక్స్

ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్-అచ్చమైన తెలంగాణ పదాలతో ఉల్లిపూల పాట-లిరిక్స్ చూసి పాడేయండి! (youtube/ Saregama Telugu)
ఇడుపు కాయితం నుంచి మరో క్రేజీ సాంగ్-అచ్చమైన తెలంగాణ పదాలతో ఉల్లిపూల పాట-లిరిక్స్ చూసి పాడేయండి! (youtube/ Saregama Telugu)

ఇడుపు కాయితం మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్లుగా నిలిచాయి. శ్రీలత, గడప లాంటి సాంగ్స్ యూట్యూబ్ లో అదరగొడుతున్నాయి. ఇప్పుడిక తెలంగాణ జానపద పాటకు అద్దం పడుతూ ఉల్లిపూల సాంగ్ వచ్చేసింది.

ఈ ఉల్లిపూల పాటను అభినయ శ్రీనివాస్ రాశారు. హీనాగ్రేస్ అద్భుతంగా పాడారు. జానపద పాటలకు నాగ దుర్గ ఎలా డ్యాన్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఉల్లిపూల సాంగ్ లోనూ ఆమె డ్యాన్స్ ఇరగదీసింది. ఈ పక్కా తెలంగాణ జానపద పాట లిరిక్స్ ఇక్కడున్నాయి.

పల్లవి:

హోయ్...

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

బండిమీద నీతో పోంగరా నా శ్రీనివాసా

ఉండలేను ఉన్నా తీరుగా..

గుండెల్లో నువ్వు మోగంగనే గంపెడు సిగ్గులు పూసెనురా

కండ్లల్లో నువ్వు మెరవంగనే సెంపలు ఎరుపెక్కిపోయెనురా

గోరంత ముద్దుల్లో కొండంత ప్రేమలు ఒళ్లంతా విరబూసేరా.. హోయ్

ఉత్తరాది సెరువేదాటి

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

బండిమీద నీతో పోంగరా నా శ్రీనివాసా

ఉండలేను ఉన్నా తీరుగా

చరణం – 1:

రావే పోవే అంటే నువ్వు

రాణిలెక్క మురిసిపోతా

ఏమే పిల్లా అంటే నన్ను

యెన్నేలోలే యెలిగిపోతా

కన్నుబొమ్మల సైగలు చూసి

కొంటె పిలుపులు తెలుసుకుంటా

గాలిలోన రాతలు సదివి

గుండె తలుపులు తెరుసుకుంటా

రెండు సేతులా అదుముకుంటే

గువ్వపిల్లై ఒదిగేనయ్యో

గదుమ మీద ముద్దే పెడితే

కడుమ సంగతే సిగ్గేనయ్యో... హోయ్

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

బండిమీద నీతో పోంగరా నా శ్రీనివాసా

ఉండలేను ఉన్నా తీరుగా

చరణం – 2:

సర్వపిండి సకినాలుబోసి

గరముచాయే చేతికిస్తే

సన్నగా నువ్వు తాకంగానే

ఎన్నలాగ కరిగిపోతి

పొద్దుమాపు నీతో ఉంటే

ఏళాపాళా మరిసేపోతి

కొద్దిసేపు అవుపడకున్న

రందితోటి సగమైపోతి

సిన్న చిన్న బతుకుల్లోన

ఉండవయ్యో నిన్నా మొన్నా

ఉన్నవన్ని ఆనందాలే

కన్నవన్నీ కమ్మని కలలే

హోయ్...

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

ఉల్లిపూల సీరేగట్టి

ఉత్తరాది సెరువేదాటి

బండిమీద నీతో పోంగరా నా శ్రీనివాసా

ఉండలేను ఉన్నా తీరుగా!

Featured Video

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks