...
...
Next Story

Upasana: నారా లోకేష్ ముందే తప్పు ఒప్పుకొన్న ఉపాసన-పిల్లలకు రామ్ చరణ్ అన్నం తినిపిస్తుంటే అలా అనుకున్నానంటూ కామెంట్లు!

Upasana Comments: మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల తాజాగా'సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026'లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్‌తో కలిసి వేదికను పంచుకున్న ఆమె.. పేరెంటింగ్, స్త్రీ పురుష సమానత్వంపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Published on: Nov 14, 2026, 14:51:39 IST
Advertisement

Upasana Comments: విశాఖపట్నం వేదికగా జరిగిన CII పార్టనర్ షిప్ సమ్మిట్ 2026లో పలువురు వ్యాపార, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఉపాసన ముచ్చటించారు. పిల్లల పెంపకంలో భార్యాభర్తలిద్దరూ 50-50 బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లల మైండ్ సెట్ లో నాటాలని లోకేష్ ప్రస్తావించగా, ఈ వ్యాఖ్యలతో ఉపాసన ఏకీభవించారు.

తండ్రి అన్నం తినిపిస్తే చప్పట్లు కొడతారా?

నారా లోకేష్ ముందే తప్పు ఒప్పుకొన్న ఉపాసన-పిల్లలకు రామ్ చరణ్ అన్నం తినిపిస్తుంటే అలా అనుకున్నానంటూ కామెంట్లు! (x)
నారా లోకేష్ ముందే తప్పు ఒప్పుకొన్న ఉపాసన-పిల్లలకు రామ్ చరణ్ అన్నం తినిపిస్తుంటే అలా అనుకున్నానంటూ కామెంట్లు! (x)

"ఒక తండ్రి తన బిడ్డకు అన్నం తినిపించినా లేదా డైపర్ మార్చినా చుట్టూ ఉన్నవాళ్లంతా వావ్ ఎంత మంచి తండ్రి అని చప్పట్లు కొడతారు. కానీ అదే పని తల్లి చేస్తే నాకోసం ఎవరూ చప్పట్లు కొట్టరేం? ఇంటి దగ్గర ఈ మైండ్‌సెట్ మారనంత కాలం బోర్డు రూమ్‌లలో కూడా మార్పు రాదు. ఈ విషయంలో మనం చాలా పని చేయాల్సి ఉంది.

విద్యావిధానంలో, సిలబస్‌లో కూడా ఇది భాగం కావాలి. పిల్లల బాధ్యత తండ్రి చూసుకోవడం అనేది ఎవరికో చేసే ఫేవర్ కాదు. అది బాధ్యత గల పేరెంటింగ్" అని ఉపాసన కుండబద్దలు కొట్టారు.

నేను కూడా ఆ తప్పు చేశా

విద్యా వ్యవస్థలో మార్పు రావడంతో పాటు ఇంటి వాతావరణంలోనూ మార్పులు రావాలని ఉపాసన అభిప్రాయపడ్డారు. "పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ సమానత్వాన్ని నేర్పించాలి. ముఖ్యంగా ఇంట్లో మగపిల్లలు ఏదైనా చిన్న పని చేస్తే, తల్లులు అదొక గొప్ప విషయంగా ఫీల్ అవ్వకూడదు. అప్పుడే ఈ వ్యవస్థ మారుతుంది.

నిజం చెప్పాలంటే భార్యగా నేను కూడా ఈ తప్పు చేశా. రామ్ చరణ్ మా పిల్లలకు అన్నం తినిపిస్తుంటే నాకు చాలా క్యూట్ గా అనిపించేది. కానీ అది తల్లిదండ్రులుగా చేయాల్సిన చాలా సాధారణమైన విషయం అని ఇప్పుడు నాకు అర్థమైంది" అంటూ ఉపాసన తన మనసులోని మాటలను ఓపెన్ గా పంచుకున్నారు.

ముగ్గురు పిల్లలతో చరణ్, ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా వచ్చిన 'పెద్ది' సినిమాలో చరణ్ నటించిన విషయం తెలిసిందే. అందులో జాన్వీ కపూర్ క్యారెక్టర్ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ చరణ్ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ తో కలిసి RC 17 షూటింగ్ లో చరణ్ బిజీగా ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks