...
...
Next Story

Ustaad Bhagat Singh: ధురంధర్ 2తో పోటీ.. రిస్క్ తీసుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్.. ఆ నష్టం తప్పదా?

Ustaad Bhagat Singh: వన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ పరంగా చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ రిస్క్ చేస్తుందనే కామెంట్లు వస్తున్నాయి. ధురంధర్ 2 తో క్లాష్ దెబ్బతీస్తుందని అంటున్నారు.

Published on: Mar 12, 2026, 06:22:47 IST
Advertisement

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న సెకండ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు ధురంధర్ 2 కూడా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆ మూవీ దూసుకుపోతుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ రిస్క్ తీసుకున్నారేమో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/UBSTheFilm)
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/UBSTheFilm)

ఓజీ లాంటి సూపర్ హిట్ మూవీతో పవన్ కల్యాణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అదే ఊపులో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీ ఉగాది రోజు ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. మార్చి 19 న రిలీజ్ కానుంది.

ప్రీ పోన్

నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మార్చి 26 న రిలీజ్ చేయాలి ముందు డిసైడ్ చేశారు. ఆ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత మార్చి 19 కి మార్చారు. ఉగాదికి ఊచకోత అంటూ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మూవీ విడుదలను ప్రీ పోన్ చేశారు.

ధురంధర్ 2

వారం ముందుగానే ఇప్పుడు థియేటర్లకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ధురంధర్ 2 రూపంలో బిగ్ ఛాలెంజ్ ఎదురు కానుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై థ్రిల్లర్ కూడా మార్చి 19 న రిలీజ్ అవుతుంది. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒకే రోజు రాబోతున్నాయి. తెలుగులోనూ ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు తెలుగు టికెట్ల సేల్స్ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఓపెనింగ్ కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

నష్టం తప్పదా?

పవన్ కల్యాణ్ సినిమా అంటే సెలబ్రేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం ధురంధర్ 2 కారణంగా నష్టం తప్పేలా లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా వస్తున్న ధురంధర్ 2పై భారీ హైప్ నెలకొంది.

ఈ పరిస్థితుల్లో ధురంధర్ 2 మూవీతో క్లాష్ ను ఉస్తాద్ భగత్ సింగ్ తప్పించుకుంటే బాగుండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సోలోగా వస్తే తిరుగుండేది కాదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో మార్చి 19న చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks