Ustaad Bhagat Singh OTT: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అదిరే న్యూస్. తమ ఫేవరెట్ హీరో పవన్ కల్యాణ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. పోలీస్ పాత్రలో పవన్ అదరగొట్టిన ఈ మూవీ వచ్చే వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ

పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 16, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అందుబాటులో ఉంటుందని ఓటీటీ ప్లాట్ ఫామ్ శనివారం (ఏప్రిల్ 11) ప్రకటించింది.
అయిదు భాషల్లో
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయిదు భాషల్లో ఓటీటీ డెబ్యూ చేయనుంది. ఒరిజినల్ తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఉస్తాద్ భగత్ సింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ‘‘పేరు భగత్, కానీ ఉద్యమమే తన గుర్తింపు’’ అనే క్యాప్షన్ తో ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది.
డిజాస్టర్ గా మూవీ
భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. రూ.100 కోట్ల కలెక్షన్లు కూడా దక్కించుకోలేదు. మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ సారి ఫెయిల్
{{/usCountry}}భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. రూ.100 కోట్ల కలెక్షన్లు కూడా దక్కించుకోలేదు. మార్చి 19, 2026న థియేటర్లలో రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ సారి ఫెయిల్
{{/usCountry}}పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కానీ ఈ సారి మాత్రం ఆ కాంబో ఆకట్టుకోలేకపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఫ్యాన్స్ ను, సినీ లవర్స్ ను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ మరోసారి పోలీస్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. ఇందులో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. చిన్నప్పుడు అనాథ అయిన పిల్లాడిని చంద్రశేఖర్ రావు (కె.ఎస్.రవికుమార్) చేరదీసి పెంచుతాడు. అతనిలోని ఆవేశం చూసి భగత్ సింగ్ అని పేరు పెడతాడు.
చంద్రశేఖర్ రావు సీఎం అవుతాడు. అయితే చెదలమర్రి నల్లనాగప్ప (పార్తిబన్) సీఎం పీఠంపై కన్నేస్తాడు. అతని నుంచి చంద్రశేఖర్ రావును ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కల్యాణ్) ఎలా కాపాడాడు అన్నదే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టోరీ.