...
...
Next Story

Ustaad Bhagat Singh OTT: ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. డిజిటల్ స్ట్రీమింగ్ ఈ ప్లాట్ ఫామ్ లోనే.. అదిరే రేటుకు డీల్

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఉగాది సందర్భంగా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ డీల్ వైరల్ గా మారింది.

Published on: Mar 18, 2026, 10:45:14 IST
Advertisement

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ కు రెడీ అయింది. పవన్- హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర బృందం వరుస సర్ ప్రైజ్ లతో అభిమానుల్లో జోష్ నింపుతోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ కు సంబంధించిన ఓ బజ్ వైరల్ గా మారింది.

నెట్‌ఫ్లిక్స్ ఖాతాలోకి ఉస్తాద్

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రైట్స్ కోసం గట్టి డిమాండ్ ఏర్పడింది. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పోటీపడ్డాయి. కానీ చివరకు చివరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ రేసులో నెగ్గింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ ఓటీటీలోకి రానుంది.

డీల్ ఎంతంటే?

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ కు మంచి ఓటీటీ డీల్ కుదిరిందని తెలిసింది. పవన్ కల్యాణ్ పాన్ ఇండియా క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ. 80 కోట్లకు పైగా వెచ్చించి డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది.

ఉగాది ధమాకా

ఉస్తాద్ ఉగాది అంటూ పండక్కి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తుంది. మొదట ఈ సినిమా మార్చి 26న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, యష్ 'టాక్సిక్' సినిమా వాయిదా పడటంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒక వారం ముందే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మార్చి 19న రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ గెటప్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks