...
...
Next Story

Rakhi Sawant Non Bailable Warrant: హీరోయిన్ రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఆత్మహత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం!

Rakhi Sawant Non Bailable Warrant Suicide Case: ప్రముఖ నటి, ఒక్కపటి హీరోయిన్ రాఖీ సావంత్ న్యాయపరమైన చిక్కుల్లో పీకల్లోతూ కూరుకుపోయారు. తాజాగా ఆమెకు కోర్టు షాక్ ఇచ్చింది. 2010 నాటి ఆత్మహత్య కేసులో రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కఠినమైన ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం.

Published on: Oct 18, 2026, 19:30:17 IST
Advertisement

Rakhi Sawant Non Bailable Warrant Suicide Case: బాలీవుడ్ వివాదాస్పద నటి, సీనియర్ హీరోయిన్ రాఖీ సావంత్‌కు చట్టపరమైన చిక్కులు మరింత తీవ్రమయ్యాయి. పుష్కర కాలం కిందటి నాటి ఆత్మహత్య కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో ఆమెపై ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లా న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

టీవీ రియాలిటీ షోలో

హీరోయిన్ రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఆత్మహత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం!
హీరోయిన్ రాఖీ సావంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్.. ఆత్మహత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం!

గతంలో రాఖీ సావంత్ హోస్ట్‌గా వ్యవహరించిన ఒక టెలివిజన్ రియాలిటీ షోలో ఆమె తీవ్రంగా అవమానించడం వల్లే ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడనేది ఈ కేసులోని ప్రధాన ఆరోపణ. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఇచ్చిన సమన్లకు రాఖీ సావంత్ పదే పదే గైర్హాజరవుతూ వచ్చారు.

న్యాయమూర్తి కఠిన ఆదేశాలు

దీనిని తీవ్రంగా పరిగణించిన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) అంజలి, రాఖీ సావంత్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ప్రభుత్వ న్యాయవాది (క్రిమినల్) మృదుల్ కాంత్ శ్రీవాస్తవ శనివారం (అక్టోబర్ 17) అధికారికంగా వెల్లడించారు. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేస్తూ, ఆ రోజునాటికి ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు.

అసలు ఏం జరిగింది?

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2010 అక్టోబర్‌లో ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో 'రాఖీ కా ఇన్సాఫ్' పేరుతో ఒక టాక్ షో ప్రసారమైంది. దంపతుల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించే నెపంతో నడిచే ఈ షోకి, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని హన్సారీ ప్రేమ్ నగర్‌కు చెందిన లక్ష్మణ్ అహిర్వార్, ఆయన భార్య అనితలు హాజరయ్యారు.

తన కొడుకు మరణానికి టీవీ షోలో రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలే కారణమని లక్ష్మణ్ తల్లి సావిత్రి ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొడుకును సమాజంలో తలెత్తుకోకుండా చేసి, ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపించారని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నాటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఇటీవలి వివాదాల్లో రాఖీ సావంత్

ఒకవైపు ఈ పాత కేసు వెంటాడుతుండగానే, మరోవైపు రాఖీ సావంత్ బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీతల వైవాహిక జీవితంపైన సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. గోవిందా తన భార్యను పక్కనపెట్టి తోటి నటి కోమల్ రాణి స్వర్ణకార్‌తో సన్నిహితంగా ఉంటున్నారంటూ మీడియా ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"40 ఏళ్లపాటు తోడుండి, ఇద్దరు పిల్లలనిచ్చిన భార్యను వదిలేసి వేరొకరితో ఉండటం తగదు. ఈ విషయంలో దేశమంతా గోవిందాపై కోపంగా ఉంది" అని రాఖీ సావంత్ మీడియా వద్ద పేర్కొన్నారు. తనతో పెట్టుకోవద్దంటూ సదరు నటిని బహిరంగంగా హెచ్చరించడం సంచలనం సృష్టించింది.

బుల్లితెరపై టీఆర్‌పీల కోసం

బుల్లితెరపై టీఆర్‌పీల కోసం చేసే హంగామా, అనుచిత వ్యాఖ్యలు సామాన్యుల జీవితాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతాయో ఈ కేసు స్పష్టం చేస్తోంది. న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడంతో డిసెంబర్ 1న విచారణకు రాఖీ సావంత్ స్వయంగా హాజరవుతారా లేదా పోలీసులు ఆమెను అరెస్టు చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks