...
...
Next Story

Today OTT: ఓటీటీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే.. ఒకేరోజు తెలుగులో వ‌చ్చిన రెండు మ‌ల‌యాళం సినిమాలు.. కామెడీ, థ్రిల్ల‌ర్

Today OTT: మలయాళం మూవీస్ ను ఎంజాయ్ చేసే తెలుగు ఓటీటీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. తెలుగులోనూ ఇవి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: May 8, 2026, 09:48:21 IST
Advertisement

Today OTT: ఓటీటీ ఆడియన్స్ కు డబుల్ కిక్ అందించేందుకు. ఎంటర్ టైన్మెంట్ మోతను రెట్టింపు చేసేందుకు రెండు మలయాళం సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఒకే రోజు వాలా 2, భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమాలు డిజిటల్ డెబ్యూ చేశాయి. ఇవాళ (మే 8) నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి. ఇంకెందుకు లేటు ఓ లుక్కేయండి మరి.

వాలా 2 ఓటీటీ

ఓటీటీలోకి మలయాళం సినిమాలు
ఓటీటీలోకి మలయాళం సినిమాలు

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన రీసెంట్ కామెడీ మూవీ ‘వాలా 2’. వాలాకు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులోనూ ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ శుక్రవారం ఓటీటీ డెబ్యూ చేసింది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది.

యూత్ స్టోరీ

వాలా 2 మూవీ యూత్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్లు ఉంటారు. వాళ్ల పేరెంట్స్ ఎన్నో కష్టాలు పడి తమ కొడుకులను కాలేజీకి పంపుతారు. కానీ ఈ నలుగురు మాత్రం గొడవలకు సై అంటారు. ఓ గొడవ కారణంగా కాలేజీ నుంచి పంపించేయాల్సిన పరిస్థితి వస్తుంది.

మధ్యలో ఓ పోలీస్ ఆఫీసర్ కలగ చేసుకుని వీళ్లను కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పై చదువుల కోసం యూకేకు వెళ్లాలనుకున్న ఈ కుర్రాళ్ల కల నిజమైందా? అన్నదే వాలా 2 మూవీ మిగతా స్టోరీ.

భరతనాట్యం 2 మోహినియాట్టం ఓటీటీ

మరో మలయాళ బ్లాక్ బస్టర్ భరత నాట్యం 2 మోహినియాట్టం కూడా ఈ రోజే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఇది రిలీజైంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. 2024లో వచ్చిన భరతనాట్యం మూవీకి సీక్వెల్.

ఆ మరణంతో

మలయాళ సినిమాలంటే తెలుగు జనాలు ఉండే క్రేజ్ వేరు. ఇక తెలుగులో ఆ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయంటే ఎగబడి మరి చూసేస్తారు. ఇప్పుడు వాలా 2, భరతనాట్యం 2 మోహినియాట్టం కూడా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks