Vaazha 2 Box Office Record: మలయాళ చిత్ర పరిశ్రమ మరోసారి తన సత్తా చాటింది. భారీ బడ్జెట్, అగ్ర హీరోలు లేకపోయినా.. కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'వాళ 2: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్' సినిమా నిరూపించింది. సావిన్ ఎస్.ఏ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది.
100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి

విడుదలైన 16 రోజుల్లోనే కేరళలో వాళ 2 రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉండటం విశేషం.
తెలుగులో 'ప్రేమలు', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి చిన్న సినిమాలు ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఇప్పుడు 'వాళ 2' కూడా అదే బాటలో సాగుతోంది. కేవలం తొలి వారంలోనే రూ. 55 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, 17వ రోజు నాటికి రూ. 101.85 కోట్ల మైలురాయిని చేరుకుంది.
మోహన్ లాల్ రికార్డులు సైతం కనుమరుగు
ఈ సినిమా సాధించిన ఘనత సామాన్యమైనది కాదు. గతంలో మలయాళ సూపర్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'తుడరుమ్' (19 రోజులు), కల్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోక చాప్టర్ 1 చంద్ర' (24 రోజులు) పేరిట ఉన్న రికార్డులను 'వాళ 2' తిరగరాసింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత వేగంగా రూ. 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఇది అగ్రస్థానానికి చేరుకుంది.
"ఇది కేవలం మా విజయం కాదు, ప్రేక్షకులందరి విజయం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే 'వాళ 2' ఈ స్థాయికి చేరింది" అని రచయిత విపిన్ దాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కుర్రాళ్ల గోల.. కనెక్ట్ అయిన ఆడియెన్స్
{{/usCountry}}"ఇది కేవలం మా విజయం కాదు, ప్రేక్షకులందరి విజయం. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే 'వాళ 2' ఈ స్థాయికి చేరింది" అని రచయిత విపిన్ దాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
కుర్రాళ్ల గోల.. కనెక్ట్ అయిన ఆడియెన్స్
{{/usCountry}}స్కూల్ లైఫ్ నుంచి అడల్ట్‌హుడ్‌లోకి అడుగుపెట్టే నలుగురు స్నేహితుల కథే ఈ 'వాళ 2'. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, చదువులో ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అంచనాల మధ్య నలిగిపోయే హషీర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు యువకుల ప్రయాణాన్ని దర్శకుడు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
ఈ పాత్రల్లో నటించిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ, వారు పండించిన కామెడీ, ఎమోషన్ యువతకు బాగా కనెక్ట్ అయ్యాయి. అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు వంటి సీనియర్ నటులు సపోర్టింగ్ రోల్స్‌లో మెరిశారు. ప్రతి సామాన్య యువకుడు తన జీవితాన్ని ఈ సినిమాలో చూసుకోవడమే దీని సక్సెస్ సీక్రెట్.
త్వరలో 'వాళ 3'.. ఈసారి లేడీ గ్యాంగ్‌తో!
ఈ చిత్రం సాధించిన భారీ విజయంతో మేకర్స్ ఇప్పటికే మూడవ భాగం 'వాళ 3'ని ప్రకటించారు. అయితే ఈసారి ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఇప్పటివరకు అబ్బాయిల స్నేహం చుట్టూ తిరిగిన ఈ ఫ్రాంచైజీ, మూడవ భాగంలో పూర్తిగా మహిళా ప్రధాన తారాగణంతో రాబోతోంది. కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ వాళ సిరీస్ కొనసాగుతుందని విపిన్ దాస్ స్పష్టం చేశారు.