Varanasi: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రీచ్ ను వరల్డ్ వైడ్ గా పెంచేందుకు గ్లోబల్ ఆడియన్స్ ను రాజమౌళి టార్గెట్ చేశాడు. తాజాగా మెక్సికోలో జరుగుతున్న ఈవెంట్లో వారణాసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అట్రాక్షన్ గా వారణాసి

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే బజ్ ఏర్పడింది. ఇప్పుడీ హైప్ ను మరింత పెంచేలా, గ్లోబల్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా మూవీ టీమ్ ప్లాన్ చేసింది. మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి మూవీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
బీటీఎస్ వీడియో
కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో వారణాసి ప్రొడ్యూసర్లలో ఒకరైన ఎస్ఎస్ కార్తీకేయ పాల్గొన్నాడు. స్టేజీపై వారణాసి సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అలాగే వారణాసి ప్రివ్యూ వీడియోను కూడా ప్లే చేశారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వీడియో మెసేస్ ను కూడా ప్రదర్శించారు.
రాజమౌళి వీడియో
మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్ పీరియన్స్ ఈవెంట్లో రాజమౌళి వీడియో మెసేజ్ ను ప్రదర్శించారు. ఈ వీడియోలో రాజమౌళి ‘వారణాసి’ అని రాసి ఉన్న టీషర్ట్ ను వేసుకున్నాడు. దీన్ని బట్టి మూవీని గ్లోబల్ లెవల్ తీసుకెళ్లేందుకు జక్కన్న ఎంత పట్టుదలతో ఉన్నాడో అర్థమవుతోంది.
అప్పుడే హ్యాపీ
‘‘మాయ నాగరికత, నిర్మాణం నాకెంతో ఆసక్తి కలిగిస్తాయి. బాహుబలిలోని సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్ స్ఫూర్తి. మీలాంటి అద్భుతమైన ప్రజల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది.
{{/usCountry}}‘‘మాయ నాగరికత, నిర్మాణం నాకెంతో ఆసక్తి కలిగిస్తాయి. బాహుబలిలోని సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇట్ స్ఫూర్తి. మీలాంటి అద్భుతమైన ప్రజల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది.
{{/usCountry}}25 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నా. కానీ సముద్రాలను దాటి సినిమా రీచ్ అయినప్పుడు, వేల మైళ్ల దూరంలోని ప్రజలు మన సినిమాను ఫీల్ అవుతున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ తో నాకు అదే దక్కింది. నాటు నాటు సినిమాకు ప్రపంచమంతా డ్యాన్స్ చేసింది. అప్పుడే నేను ఎందుకు సినిమాలు చేస్తున్నానో అర్థమైంది’’ అని వీడియోలో రాజమౌళి పేర్కొన్నాడు.
ఈవెంట్ కోసమేనా?
మెక్సికోలో జరుగుతున్న ఈవెంట్లో ప్లే చేసిన వారణాసి బీటీఎస్ వీడియో ఎక్స్ క్లూజివ్ మాత్రమే అనే కామెంట్లు వస్తున్నాయి. అంటే ఈ ఈవెంట్ కోసమే ఆ వీడియోను రూపొందించారని తెలిసింది. దీన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయరని టాక్. అదే నిజమైతే ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవడం గ్యారెంటీ.