Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' (Varanasi). ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
వారణాసి యాక్షన్‌పై కార్తికేయ కామెంట్స్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి దిగ్గజ సినిమాల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడం వల్ల 'వారణాసి'లోని యాక్షన్ బ్లాక్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ మాట్లాడుతూ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ వేరే రేంజ్ లో ఉంటాయన్నారు.
సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా
"వారణాసి సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాలు చాలా క్రేజీగా ఉంటాయి. మీరు గతంలో ఆర్‌ఆర్‌ఆర్ లేదా బాహుబలి సినిమాల్లో చూసిన తరహా యాక్షన్ కాదు ఇది. ఇది పూర్తి భిన్నమైన శైలిలో ఉంటుంది. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది" అని కార్తికేయ స్పష్టం చేశారు. రాజమౌళి మార్క్ ఎలివేషన్స్, సరికొత్త స్టంట్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా 'వారణాసి' యాక్షన్ విశేషాలను గతంలో పంచుకున్నారు. ఈ సినిమా కోసం తాను దాదాపు 14 నెలలుగా పనిచేస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, టైమ్ లైన్ దాటుతూ సాగే ఒక ఎపిక్ అడ్వెంచర్ మూవీగా 'వారణాసి'ని ఆమె అభివర్ణించారు.
అంతేకాకుండా ఇందులో చాలా స్టన్నింగ్ స్లో మోషన్ జంప్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ విజువల్స్ ఉండబోతున్నాయని ప్రియాంక హింట్ కూడా ఇచ్చారు.
గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}అంతేకాకుండా ఇందులో చాలా స్టన్నింగ్ స్లో మోషన్ జంప్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ విజువల్స్ ఉండబోతున్నాయని ప్రియాంక హింట్ కూడా ఇచ్చారు.
గ్రాండ్ రిలీజ్
{{/usCountry}}రాజమౌళి విజువల్ వండర్స్‌కి మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తోడవుతుండటంతో ఈ వారణాసి సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్, బజ్ ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఉగాది కానుకగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గ్లోబల్ యాక్షన్ స్టాండర్డ్స్
రాజమౌళి ప్రతి సినిమాతోనూ తన మునుపటి రికార్డులను, విజువల్ స్టాండర్డ్స్‌ను దాటుకుంటూ ముందుకు వెళ్తుంటారు. 'బాహుబలి'లో జానపద/యుద్ధ సన్నివేశాలు, 'ఆర్‌ఆర్‌ఆర్'లో పీరియాడిక్ మాస్ ఎలివేషన్లను చూపించిన జక్కన్న.. 'వారణాసి' విషయంలో అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ వ్యాఖ్యలు పరిశీలిస్తే, హాలీవుడ్ తరహా రియలిస్టిక్ స్టంట్స్, కాన్సెప్ట్-డ్రివెన్ యాక్షన్ ఈ చిత్రంలో కనిపించబోతోందని స్పష్టమవుతోంది.