రాజమౌళి సినిమా అంటే ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్ మూవీ, అది కూడా రామాయణంతో ముడిపడిన ఓ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంకేముంది వారణాసిపై అంచనాలు భారీగా పెరిగాయి. అందరూ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని తెలిసింది.
వారణాసి రిలీజ్ డేట్

గతేడాది నవంబర్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి సినిమా టైటిల్ ను వారణాసిగా ప్రకటించారు. ఈ మూవీ నుంచి రుద్రగా మహేష్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్లోనే వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు బజ్ ప్రకారం ఈ సినిమా 2027 ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుందని తెలిసింది.
శ్రీ రామనవమి స్పెషల్
వారణాసి సినిమాకు రామాయణానికి లింక్ ఉంటుందని డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే చెప్పారు. అంతే కాకుండా శ్రీ రాముడి గెటప్ లో మహేష్ బాబును చూస్తే గూస్ బంప్స్ కూడా వచ్చాయన్నారు. అంటే ఈ మూవీలో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపిస్తారన్నమాట.
ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీని శ్రీ రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 9, 2027న రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రేజీ ప్రాజెక్ట్
కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ సినీ రంగంలోనే వారణాసి ఓ క్రేజీ బిగ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారణాసి మూవీని రూ.1300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలిసింది.
టీజర్ అదుర్స్
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లోనే రిలీజ్ చేసిన వారణాసి టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా స్టోరీ వేర్వురు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా వారణాసి మూవీని ఐమాక్స్ ఫార్మాట్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు. మ్యూజిక్ ఏమో ఎంఎం కీరవాణి. వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక యుద్ధ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్నాడనే సంగతి తెలిసిందే.
{{/usCountry}}గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లోనే రిలీజ్ చేసిన వారణాసి టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా స్టోరీ వేర్వురు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా వారణాసి మూవీని ఐమాక్స్ ఫార్మాట్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు. మ్యూజిక్ ఏమో ఎంఎం కీరవాణి. వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక యుద్ధ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్నాడనే సంగతి తెలిసిందే.
{{/usCountry}}