ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ వారాణాసి. గతేడాది చివర్లో ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని చెప్పినా.. కచ్చితమైన డేట్ చెప్పలేదు. కానీ తాజాగా కాశీలో కొన్ని హోర్డింగ్స్ ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానున్నట్లు చెబుతున్నాయి.
వారణాసి వచ్చేది ఆ రోజే

ఎస్ఎస్ఎంబీ29గా మొదలై.. తర్వాత గ్లోబ్‌ట్రాటర్ గా మారి ఫైనల్ గా వారణాసి అనే టైటిల్ సొంతం చేసుకున్న మహేష్ బాబు మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరమ పవిత్రమైన కాశీ నగరంలో ఇప్పుడీ సినిమాదే అంటూ కొన్ని హోర్డింగ్స్ దర్శనమిస్తున్నాయి.
వాటిపై ఏప్రిల్ 7, 2027న థియేటర్లలోకి అని రాసి ఉంది. మూవీ పేరు లేకపోయినా.. ఆ థీమ్ వారణాసి సినిమాతో మ్యాచ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఇది కచ్చితంగా ఆ మూవీదే అంటున్నారు. పైగా వారణాసి నగరంలోనే ఈ హోర్డింగ్స్ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉగాది రోజును ఎంచుకున్నారా?
ఈ హోర్డింగ్స్ పై ఉన్న తేదీనే వచ్చే ఏడాది ఉగాది వస్తోంది. దీంతో వారణాసి మేకర్స్ ఆ తేదీనే ఎంచుకున్నారా అన్న సందేహం కలుగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. సాధారణంగా రాజమౌళి ఏం చేసినా హడావిడి ఉంటుంది.
టైటిల్ రివీల్ చేయడానికే రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశాడు. అలాంటిది రిలీజ్ డేట్ ను అంత ఈజీగా బయటకు పొక్కనీయడు జక్కన్న. ఈ నేపథ్యంలో ఈ హోర్డింగ్స్.. వారణాసి రిలీజ్ డేట్ పై బజ్ ను పెంచుతున్నాయి.
వారణాసి మూవీ విశేషాలు
మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి రేర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. గతేడాదే షూటింగ్ మొదలైంది. మామూలుగానే రాజమౌళి మూవీస్ ఏళ్లకు ఏళ్లు షూటింగ్ స్థాయిలోనే ఉంటాయి. ఇది కూడా భిన్నమేమీ కాదు. ఆమధ్య అవతార్ 3 రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. మరో 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు.
{{/usCountry}}మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి రేర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. గతేడాదే షూటింగ్ మొదలైంది. మామూలుగానే రాజమౌళి మూవీస్ ఏళ్లకు ఏళ్లు షూటింగ్ స్థాయిలోనే ఉంటాయి. ఇది కూడా భిన్నమేమీ కాదు. ఆమధ్య అవతార్ 3 రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. మరో 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు.
{{/usCountry}}ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా అతడు చాలా టైమే తీసుకుంటాడు. ఆ లెక్కన ఈ ఏడాది ఆగస్టు సమయానికి షూటింగ్ పూర్తవుతుందనుకున్నా.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మూవీని సిద్ధం చేస్తారా లేదా అన్నది చూడాలి. ఏకంగా రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ మూవీని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.