...
...
Next Story

Varun Dhawan: అదిరిపోయిన హీరో వరుణ్ ధావన్ మార్కెటింగ్ స్ట్రాటజీ- ఒకేసారి 3500 మంది స్టూడెంట్లతో- మీమ్స్‌తో అలా!

Varun Dhawan Movie Promotions With 3500 Students: సినిమా ప్రమోషన్లలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ స్టైలే వేరు. సోషల్ మీడియా ప్రభావం అంతగా లేని రోజుల్లోనే ఒకే దెబ్బకు వేల మందితో తన సినిమాను ప్రమోట్ చేయించుకున్న వరుణ్ ధావన్ తాజాగా తన మార్కెటింగ్ సీక్రెట్లను బయటపెట్టారు.

Published on: May 15, 2026, 06:31:49 IST
Advertisement

Varun Dhawan Movie Promotions With 3500 Students: నేటి డిజిటల్ యుగంలో ఒక సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం పెద్ద సవాల్‌గా మారింది. సమాచార ప్రవాహంలో తమ సినిమా ప్రత్యేకంగా నిలవాలని దర్శకులు, హీరోలు కొత్త దారులు వెతుకుతున్నారు.

అదిరిపోయిన హీరో వరుణ్ ధావన్ మార్కెటింగ్ స్ట్రాటజీ- ఒకేసారి 3500 మంది స్టూడెంట్లతో- మీమ్స్‌తో అలా!


Varun Dhawan Movi
అదిరిపోయిన హీరో వరుణ్ ధావన్ మార్కెటింగ్ స్ట్రాటజీ- ఒకేసారి 3500 మంది స్టూడెంట్లతో- మీమ్స్‌తో అలా! Varun Dhawan Movi

అయితే, సోషల్ మీడియా ప్రమోషన్లు నేటి స్థాయిలో లేని 2015లోనే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఒక వినూత్న ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు. 'బద్లాపూర్' సినిమా సమయంలో వరుణ్ ధావన్ అనుసరించిన ఆ వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

3500 మంది విద్యార్థులతో వైరల్ అనౌన్స్‌మెంట్

ఇటీవల జరిగిన 'డబ్ల్యూడబ్ల్యూపీ మీడియా బ్రూ 2026' (WWP Media’s BREW 2026) కార్యక్రమంలో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఢిల్లీలోని ఒక కాలేజీ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని వరుణ్ వెల్లడించారు.

"నేను స్టేజ్ మీద నుంచి సినిమా రిలీజ్ డేట్ చెప్తుంటే.. అక్కడ ఉన్న 3500 మంది స్టూడెంట్లను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరాను. అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్ అంతగా పాపులర్ కాదు. కానీ, ఆ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా పోస్ట్ చేయడంతో ఆ వార్త విపరీతంగా వైరల్ అయ్యింది. ఫలితంగా ఒక్క రోజులోనే కనీసం 7000 మందికి పైగా నా సినిమా రిలీజ్ డేట్ తెలిసిపోయింది" అని వరుణ్ ధావన్ వివరించారు.

మీమ్స్‌తో 'బార్డర్ 2' ఫ్రీ పబ్లిసిటీ

వరుణ్ ధావన్ కేవలం అప్పుడే కాదు, మొన్నటి 'బార్డర్ 2' సమయంలోనూ మీమ్స్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఆ సినిమాలోని 'ఘర్ కబ్ ఆవోగే' సాంగ్ విపరీతమైన ఆదరణ పొందింది. దానికి తోడు వరుణ్ ధావన్ మీద వచ్చిన కొన్ని మీమ్స్ ఆ పాటను మరింత వైరల్ చేశాయి.

వరుణ్ ధావన్ తదుపరి ప్రాజెక్టు 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai). ఈ చిత్రానికి ఆయన తండ్రి, దిగ్గజ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'మెయిన్ తేరా హీరో', 'జుడ్వా 2' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. రమేష్ తౌరానీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇందులో మనీష్ పాల్, చుంకీ పాండే వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe