...
...
Next Story

పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌కు షాక్- దర్శకుడిపై 400 కోట్ల దావా వేసిన నిర్మాత- సాంగ్స్ వివాదం,మూవీ టైటిల్ కూడా మార్చాలంటూ!

Vashu Bhagnani Tips Industries 400 Cr Lawsuit: ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీకి చెందిన పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బాంబే హైకోర్టులో రూ. 400 కోట్ల భారీ దావా వేసింది. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ నటించిన హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో ఐకానిక్ పాటలను అక్రమంగా వాడుకున్నారంటూ న్యాయపోరాటానికి దిగింది.

Published on: May 29, 2026, 12:14:06 IST
Advertisement

Vashu Bhagnani Tips Industries 400 Cr Lawsuit: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కాపీరైట్ వివాదాలు, హక్కుల పోరాటాలు కొత్తేమీ కాదు. గతంలో ఇళయరాజా పాటల రీమిక్స్ హక్కుల నుంచి మొన్నటి 'యానిమల్' సినిమా వివాదాల వరకు ఎన్నో కోర్టు మెట్లు ఎక్కాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల మధ్య సరికొత్త వివాదం చెలరేగింది.

క్లాసిక్ సాంగ్స్ అక్రమ వాడకం

పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌కు షాక్- దర్శకుడిపై 400 కోట్ల దావా వేసిన నిర్మాత- సాంగ్స్ వివాదం,మూవీ టైటిల్ కూడా మార్చాలంటూ!
పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌కు షాక్- దర్శకుడిపై 400 కోట్ల దావా వేసిన నిర్మాత- సాంగ్స్ వివాదం,మూవీ టైటిల్ కూడా మార్చాలంటూ!

ప్రముఖ నిర్మాతలు వాషు భగ్నానీ, రమేష్ తౌరానీల మధ్య సాగుతున్న వివాదం మరింత ముదిరి కోర్టుకు చేరింది. 1999లో వాషు భగ్నానీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'బీవీ నెంబర్ 1' (Biwi No.1) లోని క్లాసిక్ సాంగ్స్‌ను అక్రమంగా వాడుకున్నారంటూ టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రమేష్ తౌరానీ, కుమార్ ఎస్ తౌరానీలతో పాటు ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్‌లపై పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బాంబే హైకోర్టులో రూ. 400 కోట్ల భారీ దావా వేసింది.

సినిమా రిలీజ్‌పై స్టే ఇవ్వాలని డిమాండ్

అయితే, డైరెక్టర్ డేవిడ్ ధావన్ కుమారుడు, హీరో వరుణ్ ధావన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమాలో ఈ పాటలను ఉపయోగించడమే ఈ వివాదానికి కారణమైంది. వీకే దూబే అసోసియేట్స్ ద్వారా దాఖలైన ఈ పిటిషన్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్ కీలక డిమాండ్లు పెట్టింది.

వివాదాస్పదమైన 'చున్నరీ చున్నరీ', 'ఇష్క్ సోనా హై' అనే రెండు పాటలు ఉన్న ఈ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా విడుదలను, డిస్ట్రిబ్యూషన్‌ను, ప్రదర్శనను నిలిపివేయాలని కోరింది. అంతేకాకుండా ఓటీటీ స్ట్రీమింగ్, ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా ఈ పాటలను వాడకుండా తక్షణమే ఇంజంక్షన్ ఆర్డర్ (స్టే) ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. అనంతరం ఈ కేసు తీవ్రత గురించి వాషు భగ్నానీ తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు.

సెటిల్‌మెంట్‌కు రాలేదు

గతంలో ఇచ్చిన ఆడియో హక్కులను కూడా పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నోటీసు ద్వారా రద్దు చేసిందని, కాబట్టి కొత్త సినిమాలో ఆ పాటలను వాడే హక్కు వారికి లేదని లాయర్ స్పష్టం చేశారు. ఒకవేళ వారికే పూర్తి హక్కులు ఉంటే కోర్టులో పత్రాలు సమర్పించాలని సవాల్ విసిరారు.

సినిమా టైటిల్ మార్చాల్సిందే!

డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా టైటిల్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' అనేది కూడా పాత సినిమాలోని 'ఇష్క్ సోనా హై' సాంగ్ లైన్ నుంచే తీసుకున్నారు.

అందువల్ల ఈ సినిమా పేరును కూడా మార్చాలని పూజా ఎంటర్‌టైన్‌మెంట్ పట్టుబడుతోంది. ఒకవేళ తమ డిమాండ్లకు లొంగకపోతే అదనంగా మరో రూ. 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది.

ఆరోపణలన్నీ పూర్తిగా బేస్ లెస్

మరోవైపు ఈ ఆరోపణలను టిప్స్ అధినేత రమేష్ తౌరానీ పూర్తిగా కొట్టిపారేశారు. సదరు పాటల పూర్తి ఆడియో, మ్యూజిక్ రైట్స్ తమ కంపెనీ వద్దే ఉన్నాయని, వాషు భగ్నానీ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా బేస్ లెస్ (ఆధారాలు లేనివి) అని ఆయన గురువారం (మే 29) ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్ మొదటి వారంలోనే 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' సినిమా విడుదల కానుండటంతో, బాంబే హైకోర్టు ఈ రూ. 400 కోట్ల వివాదంపై ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు బాలీవుడ్ వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హీరోయిన్లకు షాక్

ఏది ఏమైనా ఈ వివాదం టాలీవుడ్ బ్యూటీలైన పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌లకు షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పుడు ఈ ఇద్దరు భామలు మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe