తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన “నువ్వు నాకు నచ్చావ్” ఇప్పుడు 4Kలో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు.. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అభిమానుల కోసం ఒక పండుగ అని మేకర్స్ చెబుతున్నారు.

కామెడీతో న్యూ ఇయర్
కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి కుటుంబంతో కలిసి నవ్వులు పూయించే, హృదయాన్ని తాకే సినిమా చూడటానికి ఇదే సరైన సమయం అంటూ నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. కొత్త సంవత్సరాన్ని మంచి కామెడీతో ఆహ్వానించడానికి రెడీగా ఉండండంటూ పేర్కొన్నారు.
నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్
2026 జనవరి 1న నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ కానుంది. అది కూడా ప్రపంచవ్యాప్తంగా 4కె వెర్షన్‌లో నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ అవనుంది. అయితే మొదట ఈ సినిమా ఆస్ట్రేలియా, యూరప్, UK వంటి దేశాల్లో విడుదల కాలేదు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
డైరెక్టర్ త్రివిక్రమ్ కథ
అక్కడి తెలుగు ప్రేక్షకులు 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్‌లో ఆస్వాదించనున్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన కథను టాలీవుడ్ సీనియర్ దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. ఆయన టేకింగ్ వల్లే ఈ సినిమా ప్రతి కుటుంబానికి దగ్గరైంది.
సోషల్ మీడియాలో వైరల్
ఇకపోతే ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానుల సంఖ్య లక్షల్లోకి చేరింది. ఆయన రాసిన అమరమైన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వెంకటేష్ నటన, హాస్యం, హృదయాన్ని తాకే భావాలు, ఇవన్నీ కలసి ఈ సినిమాను తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో నిలిపాయి.
కుటుంబ కథా చిత్రాలకు
{{/usCountry}}ఇకపోతే ఈ సినిమాతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానుల సంఖ్య లక్షల్లోకి చేరింది. ఆయన రాసిన అమరమైన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వెంకటేష్ నటన, హాస్యం, హృదయాన్ని తాకే భావాలు, ఇవన్నీ కలసి ఈ సినిమాను తెలుగు సినిమా అభిమానుల గుండెల్లో నిలిపాయి.
కుటుంబ కథా చిత్రాలకు
{{/usCountry}}శ్రవంతి రవికిషోర్ నిర్మాణంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెలుగు కుటుంబ కథా చిత్రాలకు ఒక ప్రామాణంగా నిలిచింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ ఈ సినిమాను 4K లో తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిపుల్ ఆర్తి అగర్వాల్ నటించింది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ మధ్య వచ్చే రొమాంటిక్, కామెడీ సీన్స్ ఎంతగానో అలరించాయి. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అలాగే, గెస్ట్ అప్పిరియెన్స్ ఇచ్చిన ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
వీరితోపాటు నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ, చంద్రమోహన్, సునీల్, బ్రహ్మానందం, సుహాసిని, బాబు మోహన్‌ల నటన, కామెడీ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నువ్వు నాకు నచ్చావ్ మూవీకి ఐఎమ్‌డీబీలో పదికి 8.8 రేటింగ్ ఉండటం విశేషం.