...
...
Next Story

వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ- మనసును కదిలించే కుటుంబ బంధాల కథ- నటుడు ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా మెప్పించిందా?

Venkatramaiah Gari Taluka Review And Rating In Telugu: తల్లిదండ్రుల ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ప్యూర్ ఫ్యామిలీ డ్రామా వెంకట్రామయ్య గారి తాలూకా. కొత్త నటీనటులతో దర్శకుడు సతీష్ ఆవాల రూపొందించిన ఈ భావోద్వేగ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూలో చూద్దాం.

Published on: Jul 19, 2026, 05:50:34 IST
Advertisement

Venkatramaiah Gari Taluka Review In Telugu And Rating: కుటుంబ విలువలు, రూటెడ్ విలేజ్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యూ తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రమే 'వెంకట్రామయ్య గారి తాలూకా'. గతంలో 'బలగం' వంటి చిత్రాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ కథను దర్శకుడు సతీష్ ఆవాల ఎంచుకున్నారు.

వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ- మనసును కదిలించే కుటుంబ బంధాల కథ- నటుడు ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా మెప్పించిందా?
వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ- మనసును కదిలించే కుటుంబ బంధాల కథ- నటుడు ప్రభాకర్ కూతురు దివిజ హీరోయిన్‌గా మెప్పించిందా?

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఈ సినిమాతో పరిచయం అయింది. ఇందులో దినేష్ కుమార్ హీరోగా చేశాడు. ట్రైలర్, టీజర్, సాంగ్స్‌తో మెప్పించిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎంతమేర ఆకట్టుకుందో నేటి వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

పిల్లలే తన సర్వస్వంగా భావించే ఒక సాదాసీదా మధ్యతరగతి తండ్రి వెంకట్రామయ్య (మురళీధర్ గౌడ్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆయనకు ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. పిల్లల సంతోషం కోసం వారి ప్రేమ పెళ్లిళ్లను సైతం అంగీకరించి, తనకున్న ఆస్తులు, భూములను త్యాగం చేస్తాడు. అయితే కాలం గడిచేకొద్దీ పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయి.

వృద్ధాప్యంలో తల్లి, ఆ తర్వాత తండ్రి వెంకట్రామయ్య ఎదుర్కొన్న మానసిక వేదన ఎలాంటిది? సమాజంలో అంతరించిపోతున్న అనుబంధాలను ఈ కుటుంబం ఎలా ఎదుర్కొంది? తల్లిదండ్రుల గొప్పతనం పిల్లలు తెలుసుకున్నారా? అనేదే సినిమా కథ.

విశ్లేషణ:

ఇది ఒక పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా. ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్న మనుషులు.. క్రమంగా దూరమవుతున్న కుటుంబ బంధాలు.. వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో ఓ మధ్యతరగతి తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలు ఎలా ఉంటాయో చూపించే సీన్లతో సినిమాను హృద్యంగా తెరకెక్కించారు.

వెంకట్రామయ్య పరిచయం, ఆయన కుటుంబం, సమాజంలో ఆయనకున్న పేరు వంటి సీన్లతో సాగుతుంది సినిమా. ఆ తర్వాత హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఆ విషయం పెద్దలకు తెలియడం, ఇరు కుటుంబాలు కలిసి పెళ్లి చేయడం దాదాపుగా ఊహించినట్లుగానే సాగుతుంది.

కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్

ఆ తర్వాత కూతుళ్లు, కుమారుడిలో వచ్చే మార్పులు, అందుకు గల సంఘటనలను బాగా రూపొందించారు డైరెక్టర్. రెండో భాగంలో వచ్చే తండ్రి-కూతుళ్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించే స్థాయిలో ఉంటాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్య సంభాషణలు లేకుండా కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రూపొందించారు.

ఇక క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్కరు కున్నీళ్లు పెట్టించేలా ముగించారు. చరణ్ అర్జున్ అందించిన సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం (BGM) ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. ఆరు పాటలు కథలో భాగంగానే వస్తాయి. సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని, అక్కడి పచ్చదనాన్ని ఎంతో అందంగా, సహజంగా స్క్రీన్‌పై చూపించారు.

నటీనటుల నటన అదుర్స్

అందరికీ తెలిసిన కథను మరింత ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. కోమలి క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా రిచ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు మురళీధర్ గౌడ్ పోషించిన తండ్రి పాత్రే అసలైన బలం. ఒక బాధ్యతగల మధ్యతరగతి తండ్రిగా ఆయన అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు.

ఆయన పలికే సంభాషణలు, పండించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ కదలిస్తాయి. తల్లి పాత్రలో నటి సుధ తన అనుభవాన్ని ఉపయోగించి ఒద్దికైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన దినేష్ కుమార్ తొలి సినిమా అయినప్పటికీ ఎమోషనల్ సీన్లలో మంచి హావభావాలు పలికించారు. భవిష్యత్తులో నటుడిగా ఎదిగేందుకు కావలసిన ప్రతిభ ఆయనలో కనిపించింది.

ప్రముఖ నటుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అమాయకత్వం నిండిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె నటన చాలా సహజంగా సాగింది. కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

ఫైనల్‌గా చెప్పాలంటే..?

డబ్బు కంటే మనుషులు, బంధాలు ముఖ్యమని చాటిచెప్పే క్లీన్ మూవీ ఇది. భారీ యాక్షన్ హంగులు ఆశించకుండా, పెద్దగా ఎక్స్‌పెక్టేన్స్ లేకుండా ఒక కుటుంబ కథను చూడాలనుకునే వారు ఈ వీకెండ్‌లో కుటుంబ సమేతంగా వెంకట్రామయ్య గారి తాలూకా సినిమాను చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe