...
...
Next Story

Nana Patekar Death: ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూత- హీరో, విలన్, దర్శకుడుగా ప్రస్థానం- మెడికో లీగల్ కేసు!

Nana Patekar Passes Away Due To Cardiac Arrest: భారతీయ సినీ రంగానికి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నానా పటేకర్ (75) గోవాలో తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Oct 8, 2026, 08:03:05 IST
Advertisement

Nana Patekar Passes Away Due To Cardiac Arrest: భారతీయ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో, ఆవేశపూరితమైన సంభాషణలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) గురువారం (అక్టోబర్ 8) ఉదయం కన్నుమూశారు.

హఠాత్తుగా గుండెపోటుతో మృతి

ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూత- హీరో, విలన్, దర్శకుడుగా ప్రస్థానం- మెడికో లీగల్ కేసు! (AFP)
ప్రముఖ నటుడు నానా పటేకర్ గుండెపోటుతో కన్నుమూత- హీరో, విలన్, దర్శకుడుగా ప్రస్థానం- మెడికో లీగల్ కేసు! (AFP)

గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ హఠాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పనాజీలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.

వైద్యులు పోరాడినప్పటికీ

డోనా పౌలాలోని నివాసంలో స్పృహ తప్పి పడిపోయిన నానా పటేకర్‌ను అత్యవసర చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ అత్యవసర విభాగం వైద్యులు ఆయనను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు.

మెడికో లీగల్ కేసు నమోదు

"ఉదయం 5:20 గంటలకు పటేకర్ తుదిశ్వాస విడిచారు. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ (CPR) చేసి ఆయన ప్రాణాలను నిలబెట్టేందుకు వైద్య బృందం శాయశక్తులా ప్రయత్నించింది. కానీ, ఆయన శరీరం స్పందించలేదు" అని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు (MLC) నమోదు చేశామని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించనున్నామని డాక్టర్ శేఖర్ పేర్కొన్నారు.

నటనకు కేరాఫ్ అడ్రస్.. నాలుగు పదుల ప్రస్థానం

హిందీ, మరాఠీ చిత్రసీమతో పాటు నాటక రంగానికి నానా పటేకర్ అందించిన సేవలు అసమానమైనవి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన నటప్రస్థానంలో ఎన్నో మరపురాని పాత్రలకు జీవం పోశారు. కథానాయకుడిగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఆయన చూపించిన విలక్షణ శైలి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తెలుగు ఆడియెన్స్‌కు కూడా

కేవలం నటనకే పరిమితం కాకుండా 'ప్రహార్' సినిమా ద్వారా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ముద్ర వేశారు. కళారంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం 2013లో ఆయనను 'పద్మశ్రీ' పురస్కారంతో సత్కరించింది.

కరువు ప్రాంత రైతులకు చేయూత

వెండితెరపై ఎంతటి గంభీరమైన పాత్రలు పోషించినా, నిజ జీవితంలో అత్యంత నిరాడంబరంగా జీవించడం నానా పటేకర్ ప్రత్యేకత. మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల రైతులకు చేయూతనందించేందుకు 'నామ్ ఫౌండేషన్' స్థాపించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. నానా పటేకర్ మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks