స్టైలిష్ లుక్‌లో వెంకీ మామ-మన శంకర వరప్రసాద్ గారు నుంచి అదిరే సర్‌ప్రైజ్-బర్త్‌డే స్పెషల్
విక్టరీ వెంకటేష్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకీ మామ బర్త్ డే సందర్భంగా ఇవాళ మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఆయన స్టైలిష్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ అందరి హీరోల ఫ్యాన్స్ విక్టరీ వెంకటేష్ కు ఉంటారని ఎవరో చెప్పారు. అది అక్షర సత్యం. ఏ మాత్రం నెగెటివిటీ లేని, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండే హీరో వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకూ ఆయన సినిమాలను చూసేస్తారు. వెంకీ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ రోజు (డిసెంబర్ 13) వెంకీ మామ బర్త్ డే. ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఆయన లుక్ రిలీజ్ చేశారు.

వెంకటేష్ బర్త్ డే సర్‌ప్రైజ్
వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి వెంకీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోతో పోస్టర్ పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో వెంకీ స్టైలిష్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉంది. వెనుక బ్లాక్ డ్రెస్ లో గన్స్ పట్టుకుని బాడీగార్డ్స్ వస్తుంటే ముందు అలా స్టైల్ గా వెంకీ నడుచుకుంటూ వస్తున్నట్లు ఉంది.
అనిల్ స్టైల్లో
డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రమోషన్లే డిఫరెంట్ గా ఉంటాయి. ఏది చేసినా వెంటనే వైరల్ అవుతుంది. ఆయన స్టైలే అంతా. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ మూవీ నుంచి వెంకటేష్ లుక్ ను కూడా అలాగే రివీల్ చేశారు. చుట్టూ ఆర్టిస్ట్ లు ఉండగా మధ్యలో కొరియోగ్రాఫర్ సందీప్ తో కలిసి అనిల్ నిలబడి ఉన్నాడు. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, విక్టరీ వెంకటేష్.. హ్యాపీ బర్త్ డే విక్టరీ వెంకటేష్ గారు అని వెనకాలకు చూపించగానే వెంకీ లుక్ రివీలైంది.
చిరు,వెంకీ కాంబినేషన్
అనిల్ రావిపూడి, వెంకటేష్ మధ్య బాండ్ స్పెషల్ గా మారింది. ఎఫ్2తో మొదలైన వీళ్ల జర్నీ.. ఆ తర్వాత ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాంతో పరుగులు పెట్టింది. ఇప్పుడు చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారులో వెంకీతో ఓ కీ రోల్ ప్లే చేయించారు అనిల్. చిరు, వెంకీ కాంబినేషన్లో వచ్చే సీన్లు, ఫైట్, సాంగ్ అదిరిపోతాయనే టాక్ వినిపిస్తోంది.
2026 సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్లు కొట్టడం అనిల్ రావిపూడికి అలవాటే. ఈ మన శంకర వరప్రసాద్ సినిమాలో నయనతార హీరోయిన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


