...
...
Next Story

Virosh Little Fan: నన్ను కూడా పెళ్లికి పిలవొచ్చుగా- చిన్నారి అభిమాని ప్రశ్న-ఇంటికి పిలిచిన విజయ్, రష్మిక స్పెషల్ గిఫ్ట్!

Vijay Devarakonda Reply To Little Fan Says Come Home: పెళ్లికి తనని ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన చిట్టి అభిమానికి విజయ్ దేవరకొండ మనసున్న జవాబిచ్చారు. ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Mar 8, 2026, 09:10:41 IST
Advertisement

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ వేడుకలు ముగిసినా, వాటికి సంబంధించిన ముచ్చట్లు మాత్రం ఇంకా నెట్టింట సందడి చేస్తూనే ఉన్నాయి.

చిన్నారి అభిమాని ప్రశ్న

నన్ను కూడా పెళ్లికి పిలవొచ్చుగా- చిన్నారి అభిమాని ప్రశ్న-ఇంటికి పిలిచిన విజయ్, రష్మిక స్పెషల్ గిఫ్ట్!
నన్ను కూడా పెళ్లికి పిలవొచ్చుగా- చిన్నారి అభిమాని ప్రశ్న-ఇంటికి పిలిచిన విజయ్, రష్మిక స్పెషల్ గిఫ్ట్!

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ చేసి, ఆలయాల్లో అన్నదానాలు నిర్వహించి ఈ జంట తమ ఉదారతను చాటుకుంది. అయితే, తాజాగా ఒక చిన్నారి అభిమాని అడిగిన ప్రశ్న ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నన్ను పెళ్లికి పిలవచ్చుగా

విజయ్ దేవరకొండకు వీరాభిమాని అయిన ఒక చిన్నారి.. "విజయ్ దేవరకొండ, రష్మికకు పెళ్లి అయింది కదా. లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. మనం కూడా ఫ్యాన్సే కదా. నేను కూడా నీ అభిమానినే కదా.. మరి నన్ను ఎందుకు పెళ్లికి పిలవలేదు? మమ్మల్ని మర్చిపోయారా? ఈ వీడియో వారికి షేర్ చేయండి" అంటూ అమాయకంగా ప్రశ్నించింది. ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ కంట పడింది.

నీకు ఇష్టమైనవన్నీ తిందాం

దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. "బుజ్జితల్లీ.. నిన్ను ఇంటికి భోజనానికి పిలుస్తాను. నీకు ఇష్టమైన వంటకాలు, స్వీట్లు ఏంటో నాకు చెప్పు.. అవన్నీ ఇంట్లో చేయించుకుని మనం హాయిగా తిందాం" అని ఎంతో ప్రేమగా సమాధానమిచ్చారు. అటు రష్మిక మందన్నా కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ చిన్నారికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చింది.

ఆకట్టుకుంటన్న విజయ్ రిప్లై

ఇప్పుడు విజయ్ దేవరకొండ రిప్లై కూడా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. కాగా, తమ వివాహ వేడుకను కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకున్నప్పటికీ, అభిమానులందరినీ భాగస్వాములను చేసేందుకు విజయ్-రష్మిక ప్రత్యేక ప్రణాళిక వేశారు.

దేశవ్యాప్తంగా స్వీట్స్ పంపిణీ

మార్చి 4న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట మెరిసిపోయింది. క్రీమ్ కలర్ కుర్తా, ధోతీలో విజయ్.. ఎరుపు రంగు పట్టుచీర, నుదుట సిందూరంతో రష్మిక ఎంతో అందంగా కనిపించారు.

అండర్ గ్రౌండ్‌కి

ఫోటోగ్రాఫర్లతో ముచ్చటిస్తూ.. "ఈ వేడుకలు పూర్తి చేసి కొన్నాళ్ల పాటు అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోవాలని (ప్రైవసీ కోసం) అనుకుంటున్నాము" అని విజయ్ దేవరకొండ చమత్కరించిన విషయం తెలిసిందే. విజయ్ జోకులకు రష్మిక నవ్వుతుండగా, అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు.

నెటిజన్ల ప్రశంసలు

గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, పెళ్లి వరకు తమ బంధాన్ని గోప్యంగా ఉంచడం విశేషం. ఏదేమైనా, ఒక సామాన్య అభిమానిని కూడా తమ కుటుంబ సభ్యురాలిగా భావించి విజయ్ ఇచ్చిన రిప్లైపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe