...
...
Next Story

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ గుండెపై కాలు పెట్టిన కీర్తి సురేష్-బర్త్ డే ట్రీట్-రౌడీ జనార్ధన పోస్టర్-అప్పుడే రిలీజ్

Vijay Deverakonda: రౌడీ బాయ్ విజయ్ దేరకొండ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా రౌడీ జనార్ధన మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయింది. విజయ్ దేవరకొండ గుండెపై కీర్తి సురేష్ కాలు పెట్టింది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు.

Published on: May 9, 2026, 13:33:10 IST
Advertisement

Vijay Deverakonda: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా యాక్టింగ్ పై పిచ్చితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. సైడ్ క్యారెక్టర్ల నుంచి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. ఈ రోజు ఈ రౌడీ బాయ్ బర్త్ డే. ఈ సందర్భంగా అతని అప్ కమింగ్ మూవీ ‘రౌడీ జనార్ధన’ నుంచి రిలీజ్ చేసిన ఓ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ బర్త్ డే

రౌడీ జనార్ధన పోస్టర్ (x/SVC_official)
రౌడీ జనార్ధన పోస్టర్ (x/SVC_official)

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బర్త్ డే ఈ రోజు (మే 9). ఈ సందర్భంగా రౌడీ జనార్ధన మూవీ టీమ్ ఓ పోస్టర్ తో విజయ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ గుండెపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు పెట్టినట్లు ఉంది. విజయ్ చేతిలో గన్ ఉంది. ఈ పోస్టర్ తెగ వైరల్ గా మారింది.

స్టోరీ లైన్

మేకర్స్ పంచుకున్న క్యాప్షన్ బట్టి చూస్తే ఎవరికైనా ఎదురు వెళ్లే హీరో, కేవలం హీరోయిన్ ప్రేమకు మాత్రమే తగ్గుతాడని తెలుస్తోంది. రౌడీ జనార్ధన మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన సినిమాకు రవికిరణ కోలా డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ పోస్టర్ తో పాటు రౌడీ జనార్ధన మూవీ ఎప్పుడు థియేటర్లకు రాబోతుందో కూడా మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ పై డిసెంబర్ 2026 అని పేర్కొన్నారు. అంటే ఈ ఏడాది డిసెంబర్ లోనే రౌడీ జనార్ధన మూవీ థియేటర్లకు రాబోతుంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 11, 2026న విజయ్ దేవరకొండ మరో మూవీ ‘రణబాలి’ రిలీజ్ కానుంది.

రష్మికతో పెళ్లి

విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రేయసి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రణబాలి మూవీలో విజయ్, రష్మిక కలిసి నటిస్తున్నారు. జంటగా వీళ్లకు ఇది మూడో సినిమా. గతంలో ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లోనూ విజయ్, రష్మిక కలిసి యాక్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe