...
...
Next Story

Vijay Deverakonda: సినిమాల టికెట్ రేట్లపై విజయ్ దేవరకొండ బోల్డ్ స్టేట్‌మెంట్.. రాజమౌళితో చేస్తేనే.. ఫ్యాన్స్ ఖుష్!

Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి బోల్డ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన సినిమా టికెట్ల గురించి విజయ్ దేవరకొండ చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నాడో ఇక్కడ చూసేయండి.

Published on: Oct 10, 2026, 18:51:12 IST
Advertisement

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali) ప్రమోషన్స్‌లో మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచే ఒక పెద్ద ప్రకటన చేశారు. తన పరిధిలో ఉన్నంత వరకు, ఇకపై తన సినిమాలకు ఎలాంటి టికెట్ ధరల పెంపు (Ticket Price Hikes) ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

రాజమౌళి సినిమా అయితేనే

సినిమాల టికెట్ రేట్లపై విజయ్ దేవరకొండ బోల్డ్ స్టేట్‌మెంట్.. రాజమౌళితో చేస్తేనే.. ఫ్యాన్స్ ఖుష్!
సినిమాల టికెట్ రేట్లపై విజయ్ దేవరకొండ బోల్డ్ స్టేట్‌మెంట్.. రాజమౌళితో చేస్తేనే.. ఫ్యాన్స్ ఖుష్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ రణబాలి. అక్టోబర్ 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల గురించి మాట్లాడారు.

తన సినిమాల టికెట్ రేట్లు పెంచబోనని విజయ్ తేల్చిచెప్పారు. అయితే అందులో ఒకే ఒక్క మినహాయింపు ఉందని సరదాగా పేర్కొన్నారు. ఎప్పుడైనా స్టార్ డైరెక్టర్, మాస్టర్ స్టోరీటెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ గనుక వర్కౌట్ అయితే, ఆ స్కేల్ దృష్ట్యా మాత్రమే టికెట్ ధరల పెంపు ఆలోచన ఉంటుందని విజయ్ దేవరకొండ వెల్లడించారు.

సినీ లవర్స్ కు గుడ్ న్యూస్

గత కొన్నేళ్లుగా థియేటర్లలో పెరిగిన టికెట్ ధరల కారణంగా సామాన్య ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం బాగా తగ్గిపోయింది. థియేటర్ ఫుట్‌ఫాల్స్ పడిపోతున్న ఈ సమయంలో విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ నిర్ణయం సినీ ప్రేమికులకు పెద్ద ఊరటనిస్తోంది. ఇండస్ట్రీలో ఇది అత్యంత ఆహ్వానించదగ్గ పరిణామంగా సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

రెండోసారి క్రేజీ కాంబో

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన ఆయన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

దసరా రేసులో నిలవబోతున్న ఈ రణబాలి మూవీపై భారీ అంచనాలున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగింది. మరి థియేటర్లలో రణబాలి మూవీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks