రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం, టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా తమ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్ చెక్కేశారు. థాయ్‌లాండ్ తీరంలోని కో సముయి (Koh Samui) ద్వీపంలో ఈ కొత్త జంట ప్రస్తుతం సేద తీరుతోంది. తాజాగా విజయ్ రష్మిక హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ప్రకృతి ఒడిలో ఏకాంతంగా..

సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ రిసార్ట్‌లను ఎంచుకుంటారు. కానీ, విజయ్, రష్మిక మాత్రం అందుకు భిన్నంగా ఒక ప్రైవేట్ ఎయిర్ బీఎన్‌బీ (Airbnb) విల్లాను ఎంచుకున్నారు. సముద్రపు ఒడ్డున, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ విశాలమైన విల్లాలో విరోష్ ఏకాంతంగా గడుపుతున్నారు.
రొమాంటిక్‌గా హగ్
విజయ్ దేవరకొండను రష్మిక రొమాంటిక్‌గా హగ్ చేసుకున్న ఫొటోను నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వైరల్ అవుతున్న ఫోటోలో.. సూర్యకాంతి పడుతున్న మెట్లపై విజయ్, రష్మిక ఒకరినొకరు హత్తుకుని (హగ్గింగ్) చిరునవ్వుతో చూసుకుంటున్న దృశ్యం ఎంతో రొమాంటిక్‌గా ఉంది. రష్మిక పసుపు రంగు ఫ్లోరల్ డ్రెస్సులో మెరిసిపోతుండగా, విజయ్ క్యాజువల్ టీ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
రొటీన్ లగ్జరీ రిసార్ట్స్ కంటే
"విజయ్, రష్మిక తమ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారు. రొటీన్ లగ్జరీ రిసార్ట్స్ కంటే కూడా తమకు నచ్చినట్లుగా, ఎంతో సహజంగా ఉండేలా ఈ ప్రైవేట్ విల్లాను ఎంచుకున్నారు" అని ఈ జంటకు సన్నిహితంగా ఉండేవారు తెలిపారు.
రెండు సంప్రదాయాల కలయికగా వివాహం
ఇకపోతే ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లోని ఐటిసి మెమెంటోస్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. విజయ్ తెలుగు సాంప్రదాయాలు, రష్మిక మందన్నా కొడవ (కూర్గ్) ఆచారాల కలయికతో వీరి పెళ్లి వేడుక వెరైటీగా సాగింది. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఈ జంట కోసం పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు. పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు.
అత్యంత రహస్యంగా
కాగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల ద్వారా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం విశేషం. గతేడాది అక్టోబర్‌లోనే వీరికి నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి ప్రకటన వచ్చే వరకు తమ బంధాన్ని వీరు అత్యంత రహస్యంగా ఉంచింది విరోష్ జంట.
{{/usCountry}}కాగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల ద్వారా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం విశేషం. గతేడాది అక్టోబర్‌లోనే వీరికి నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి ప్రకటన వచ్చే వరకు తమ బంధాన్ని వీరు అత్యంత రహస్యంగా ఉంచింది విరోష్ జంట.
{{/usCountry}}తిరిగి షూటింగ్‌లోకి..
హనీమూన్ నుంచి రాగానే రష్మిక మందన్నా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'మైసా' (Mysaa) చిత్ర షూటింగ్‌లో ఆమె బిజీ అయిపోయారు. మరో విశేషమేమిటంటే, విజయ్, రష్మిక కలిసి 'రణబాలి' (Ranabaali) చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.