Vijay Deverakonda Rashmika Mandanna Scholarship To 180 Students Today: వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తాము రియల్ హీరోలమని టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిరూపించుకున్నారు. ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన ఈ జంట కేవలం విలాసవంతమైన జీవితానికే పరిమితం కాకుండా, సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.
విజయ్ దేవరకొండ తండ్రి ఊరు

గతంలో తమ ఫామ్‌హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న శుభ సందర్భంలో ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ నేడు (జూన్ 14) విజయ్ దేవరకొండ తన తండ్రి జన్మస్థలమైన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామానికి రష్మికతో కలిసి వెళ్లారు.
పెళ్లి తర్వాత మొదటిసారిగా తమ సొంతూరికి వచ్చిన ఈ కొత్త దంపతులకు గ్రామస్థులు ఘనస్వాగతం పలకనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా గ్రామాభివృద్ధిపై తనకున్న ప్రణాళికలను పంచుకోవడంతో పాటు, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన విద్యా పథకానికి వారు నాంది పలికారు.
విజయ్ దేవరకొండ ట్వీట్
"మేము మా నాన్నగారు పుట్టిన చిన్న గ్రామం తుమ్మన్‌పేటకు వెళ్తున్నాము. ఫిబ్రవరిలో రష్మిక, నేను కలిసి ఒక చిన్న కలని ప్రకటించాము. తెలంగాణలోని అచ్చంపేట మండలానికి చెందిన 9, 10 తరగతుల కష్టపడి చదివే విద్యార్థులను సత్కరించాలనేదే మా లక్యం. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన మెరిట్ విద్యార్థుల జాబితా ఇది" అని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
45 ప్రభుత్వ పాఠశాలలకు భరోసా
'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఈ జంట అధికారికంగా ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
మెరిట్ విద్యార్థుల జాబితా విడుదల
{{/usCountry}}'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ఈ జంట అధికారికంగా ప్రారంభించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
మెరిట్ విద్యార్థుల జాబితా విడుదల
{{/usCountry}}ఈ కార్యక్రమంలో భాగంగా కష్టపడి చదివి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విద్యార్థుల జాబితాను సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ విద్యార్థుల పైచదువులకు అయ్యే పూర్తి ఆర్థిక ఖర్చులను 'ది దేవరకొండ ఫౌండేషన్' భరిస్తుందని ఈ దంపతులు హామీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ తండ్రి చదువుకున్న జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (మొదటి ర్యాంక్), పి. ప్రణీత (ద్వితీయ ర్యాంక్) ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతి నుంచి కె. గణేష్ (మొదటి ర్యాంక్), బి. అనిల్ (ద్వితీయ ర్యాంక్) ప్రతిభ చూపి ఈ సహాయాన్ని అందుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టాలెంట్ ఉన్నప్పటికీ, టెన్త్ క్లాస్ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ స్టార్ జంట తీసుకున్న నిర్ణయం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపింది.
విజయ్, రష్మికలపై ప్రశంసలు
ఇచ్చిన మాట ప్రకారం సొంత ఊరికి వచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మికల పెద్ద మనసుకు అటు అచ్చంపేట ప్రజలతో పాటు ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.