Jana Nayagan Bhagavanth Kesari: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' ఒకటి. పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు (జన నాయకుడు), హిందీ ('జన్ నేత') భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హెచ్. వినోత్ సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
భగవంత్ కేసరీకి రీమేక్?

దళపతి విజయ్ కెరీర్ లో లాస్ట్ మూవీ ‘జన నాయగన్’. అయితే ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. దీనిపై డైరెక్టర్ హెచ్. వినోత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.
50% ప్రేరణ మాత్రమే.. రీమేక్ కాదు!
దర్శకుడు హెచ్.వినోత్ మాట్లాడుతూ.. 'జననాయగన్' చిత్రం 'భగవంత్ కేసరి' నుంచి కేవలం 50% మాత్రమే ప్రేరణ పొందిందని తెలిపాడు. "మా సినిమా మొదటి భాగంలో భగవంత్ కేసరితో 60% పోలికలు ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్‌లో కేవలం 20% మాత్రమే మ్యాచింగ్ ఉంటుంది" అని అతను స్పష్టం చేశాడు.
విజయ్ 5 సార్లు
అజిత్‌తో 'నేర్కొండ పార్వై' (పింక్ తమిళ రీమేక్) చేసిన తర్వాత మళ్లీ వేరే సినిమాను రీమేక్ చేయడానికి తనకు ఆసక్తి లేదని వినోత్ అన్నాడు. కానీ, విజయ్ స్వయంగా 'భగవంత్ కేసరి' చిత్రాన్ని 5 సార్లు చూసి, అందులోని ఉమెన్ ఎంపవర్‌మెంట్ కాన్సెప్ట్ నచ్చి దానిని చూడమని కోరారని వినోత్ వెల్లడించాడు. బాలకృష్ణ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌ను తమిళ ఆడియన్స్‌కు, విజయ్ ఇమేజ్‌కు తగినట్లుగా మార్చడం ఒక పెద్ద సవాలుగా మారిందని వినోత్ పేర్కొన్నాడు.
జన నాయగన్ - భగవంత్ కేసరి పోలికలు
- ప్రధాన కథాంశం: ‘భగవంత్ కేసరి’ సినిమా శ్రీలీలను ఒక సైనిక అధికారిగా తీర్చిదిద్దే బాబాయ్ కథ కాగా, 'జన నాయగన్' లో విజయ్, మమితా బైజూ మధ్య అలాంటి పవర్‌ఫుల్ బాండింగ్‌ను రీ-డిజైన్ చేశారు.
- స్టార్ కాస్ట్: భగవంత్ కేసరిలో బాలయ్య, కాజల్ అగర్వాల్, శ్రీలీల నటించారు. జన నాయగన్ లో విజయ్, పూజా హెగ్డే, మమితా బైజూ లీడ్ రోల్స్ ప్లే చేశారు.
- అనిల్ రావిపూడి స్పందన: గతంలో విటీవి గణేష్ ఈ సినిమా రీమేక్ అని వ్యాఖ్యానించినప్పుడు, అనిల్ రావిపూడి స్పందిస్తూ.. "ఇది ఒక దళపతి విజయ్ సినిమా, విడుదలయ్యే వరకు రీమేక్ అని పిలవకండి" అని క్లారిటీ ఇచ్చాడు.
సీఎం అయిన తర్వాత
నిజానికి జన నాయగన్ మూవీ ఈ ఏడాది జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ వల్ల లేట్ అయింది. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత ఈ చిత్రం థియేటర్లకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫుల్ గా ఆన్ లైన్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
{{/usCountry}}నిజానికి జన నాయగన్ మూవీ ఈ ఏడాది జనవరి 9న రిలీజ్ కావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ వల్ల లేట్ అయింది. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత ఈ చిత్రం థియేటర్లకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫుల్ గా ఆన్ లైన్ లో లీక్ అయిన సంగతి తెలిసిందే. మరి థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
{{/usCountry}}