బీచ్‌లో నగ్నంగా మెడిటేషన్, ఆయన దగ్గర తోటమాలిగా పని- లెజండరీ హీరో సంచలన నిజాలు బయటపెట్టిన రెండో భార్య కవిత

బాలీవుడ్ లెజెండరీ హీరో వినోద్ ఖన్నా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పి ఆధ్యాత్మిక బాట పట్టడం అప్పట్లో ఒక సంచలనం. తాజాగా ఆయన రెండో భార్య కవితా ఖన్నా, ఓషో ఆశ్రమంలో వినోద్ ఖన్నా గడిపిన విలక్షణమైన జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published on: Feb 8, 2026, 16:51:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటుడు వినోద్ ఖన్నా. లెజండరీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. గ్లామర్, సక్సెస్, కోట్లాది మంది అభిమానం.. ఇలా అన్నీ ఉన్నా వాటన్నింటినీ వదిలేసి ఆధ్యాత్మిక గురువు ‘ఓషో’ రజనీష్ చెంతకు వినోద్ ఖన్నా చేరారు.

బీచ్‌లో నగ్నంగా మెడిటేషన్, ఆయన దగ్గర తోటమాలిగా పని- లెజండరీ హీరో సంచలన నిజాలు బయటపెట్టిన రెండో భార్య కవిత
బీచ్‌లో నగ్నంగా మెడిటేషన్, ఆయన దగ్గర తోటమాలిగా పని- లెజండరీ హీరో సంచలన నిజాలు బయటపెట్టిన రెండో భార్య కవిత

తాజాగా ఆయన రెండో భార్య కవితా ఖన్నా తన యూట్యూబ్ ఛానెల్‌లో వినోద్ ఖన్నా ఆశ్రమ జీవితానికి సంబంధించిన విస్తుపోయే నిజాలను వెల్లడించారు. ముంబై బీచ్‌లో నగ్నంగా ధ్యానం నుంచి అమెరికాలో తోటమాలిగా పనిచేయడం వరకు వినోద్ ఖన్నా ప్రయాణం ఎంతో లోతైనదని కవితా ఖన్నా వివరించారు.

సన్యాసం తీసుకోవడానికి కారణం ఇదే..

వినోద్ ఖన్నాకు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉండేదని, 17 ఏళ్ల వయసులోనే ఆయన ‘ఒక యోగి ఆత్మకథ’ (Autobiography of a Yogi) పుస్తకాన్ని కొనుక్కున్నారని కవిత తెలిపారు. అయితే, ఆయన సన్యాసం తీసుకోవడానికి ప్రధాన కారణం కుటుంబంలో జరిగిన వరుస విషాదాలేనని కవిత పేర్కొన్నారు.

"రెండేళ్ల వ్యవధిలో కుటుంబంలో చాలా మంది చనిపోయారు. ముఖ్యంగా తన తల్లి మరణం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ బాధ నుంచే ఆయన ఓషో దగ్గరికి వెళ్లి సన్యాసం తీసుకున్నారు" అని కవిత వివరించారు.

ఓషో ఇంట్లో తోటమాలిగా..

భారతదేశంలో అగ్ర హీరోగా వెలుగొందిన వినోద్ ఖన్నా, అమెరికాలోని ఒరెగాన్ ఆశ్రమంలో మాత్రం చాలా సాదా సీదా జీవితాన్ని గడిపారు. ఓషో వ్యక్తిగత నివాసంలో వినోద్ ఖన్నా తోటమాలిగా పనిచేశారట.

"ఓషో ఇంటికి వెళ్లడానికి చాలా తక్కువ మందికి మాత్రమే అనుమతి ఉండేది. కానీ, వినోద్ తోటమాలి కావడం వల్ల ఆయనకు ఆ అవకాశం దక్కింది. దాన్ని ఆయన ఒక సేవగా భావించేవారు" అని కవిత చెప్పారు. అంతేకాదు, ఓషో ధరించే ప్రత్యేక దుస్తుల (Robes) డిజైన్ల కోసం వినోద్ ఖన్నా మోడల్‌గా కూడా ఉండేవారని, ఇద్దరి భుజాల కొలతలు ఒకేలా ఉండటమే అందుకు కారణమని కవిత ఖన్నా తెలిపారు.

చౌపాతీ బీచ్‌లో నగ్నంగా ధ్యానం

వినోద్ ఖన్నా ముంబైలో ఉన్న సమయంలో గిర్గావ్ చౌపాతీ బీచ్‌లో జరిగిన నగ్న ధ్యాన (న్యూడ్ మెడిటేషన్) సెషన్లలో కూడా పాల్గొన్నారని కవితా ఖన్నా గుర్తుచేసుకున్నారు.

"నగరానికి నడిబొడ్డున ఉండే ఆ బీచ్‌లో అందరూ బట్టలు విప్పేసి ఒక సర్కిల్‌గా ఏర్పడి ధ్యానం చేసేవారు. వినోద్ అందులో పాల్గొన్నారంటే అది కేవలం శారీరకమైన విషయం కాదు.. ఆధ్యాత్మికత పట్ల ఆయనకున్న అపారమైన భక్తి, అంకితభావానికి అది నిదర్శనం" అని కవిత ఖన్నా పేర్కొన్నారు.

విలన్‌గా మొదలై.. అందరివాడై..

ఇకపోతే 1968లో 'మన్ కా మీత్' సినిమాతో విలన్‌గా పరిచయమైన వినోద్ ఖన్నా ఆ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'ముఖద్దర్ కా సికందర్', 'కుర్బానీ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సూపర్ స్టార్ అయ్యారు.

1982లో సినిమాలకు దూరమై సన్యాసం తీసుకున్న వినోద్ ఖన్నా ఐదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చి సల్మాన్ ఖాన్ 'వాంటెడ్', 'దబాంగ్' వంటి సినిమాల్లో నటించారు. 2017లో మూత్రాశయ క్యాన్సర్‌తో వినోద్ ఖన్నా కన్నుమూశారు.

ధురంధర్ విలన్ తండ్రి వినోద్ ఖన్నా

వినోద్ ఖన్నా మొదటి భార్య గీతాంజలికి రాహుల్ ఖన్నా, అక్షయ్ ఖన్నా (ధురంధర్ విలన్) ఇద్దరు కుమారులు ఉండగా.. రెండో భార్య కవితకు సాక్షి, శ్రద్ధ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వినోద్ ఖన్నా సినీ ప్రయాణం ఎంత గ్లామరస్‌గా సాగిందో, ఆంతరంగిక ఆధ్యాత్మిక ప్రయాణం కూడా అంతే విలక్షణంగా సాగిందని కవిత మాటలను బట్టి అర్థమవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More