Vishwanath and Sons OTT: కోలీవుడ్ వర్సటైల్ స్టార్ సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons). బాక్సాఫీస్ దగ్గర రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ ఎంట్రీ

తమిళ, తెలుగు చిత్రసీమల్లో భారీ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ ఫ్యామిలీ డ్రామా సెప్టెంబర్ 11న ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
రూ.260 కోట్లు
దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.260 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
స్టోరీ ఏంటంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో హీరో హీరోయిన్ భార్యాభర్తలు కాదు, కానీ ఓ బిడ్డకు పేరెంట్స్ గా మాత్రం మారతారు. సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఓ బిజినెస్ సామ్రాజ్యానికి వారసుడు. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ షూటర్ కూడా. కానీ పెళ్లిపై మాత్రం నమ్మకం ఉండదు. తల్లి బలవంతం చేయడంతో సరోగసీ పద్ధతి ద్వారా అభయ్ అనే బిడ్డకు తండ్రి అవుతాడు.
అయితే ఆ చిన్నారి తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. అప్పుడు తల్లి అవసరం ఏర్పడుతుంది. బాబును కాపాడుకోవడానికి సరోగసీ ద్వారా జన్మనిచ్చిన మ్యాడీ అలియాస్ మదనకామేశ్వరి (మమితా బైజు)ని వెతుక్కుంటూ సంజయ్ కుటుంబం ఆమె వద్దకు వెళ్తుంది.
{{/usCountry}}అయితే ఆ చిన్నారి తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. అప్పుడు తల్లి అవసరం ఏర్పడుతుంది. బాబును కాపాడుకోవడానికి సరోగసీ ద్వారా జన్మనిచ్చిన మ్యాడీ అలియాస్ మదనకామేశ్వరి (మమితా బైజు)ని వెతుక్కుంటూ సంజయ్ కుటుంబం ఆమె వద్దకు వెళ్తుంది.
{{/usCountry}}తన బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సంజయ్ ఇంటికి వచ్చిన మ్యాడీ, ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు తెచ్చింది, ప్రేమ, బంధాల పట్ల సంజయ్ కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి నింపింది అనేదే ఈ మూవీ స్టోరీ.
ఐదు భాషల్లో
ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఐదు భాషల్లో అందుబాటులోకి తెస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 11న ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ఓటీటీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది.