VV Vinayak Launch Manasa Manasa Song: "కమిటీ కుర్రోళ్లు" సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" బ్యూటీ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మనసా మనసా సాంగ్ రిలీజ్

రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న అదే నీవు అదే నేను సినిమాకు యంగ్ డైరెక్టర్ కొండల్ దర్శకత్వం వహిస్తున్నారు. "అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'మనసా మనసా' సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ లాంఛ్ చేశారు.
ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్రంలోని పాటలను రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలోని పాటలు నచ్చి ఆదిత్య మ్యూజిక్ ఆడియో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చింది. తమ మూవీలోని సాంగ్ లాంఛ్ చేసి తమకు సపోర్ట్ చేస్తున్న వినాయక్‌కి ప్రొడ్యూసర్ గోవిందు కాండ్రేగుల, డైరెక్టర్ కొండల్ కృతజ్ఞతలు తెలిపారు.
వినాయక్ కామెంట్స్
ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. "కొండల్ ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తూ అదే నీవు అదే నేను సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. గోవింద్ గారికి నిర్మాతగా తొలి చిత్రమిది. ప్రొడ్యూసర్‌గా గోవింద్ గారు ఈ సినిమా విజయాన్ని అందుకుని, మరిన్ని మూవీస్ చేయాలి. మనసా మనసా సాంగ్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా" అని కోరారు.
"అదే నీవు అదే నేను" చిత్రంలోని 'మనసా మనసా' పాటను డైరెక్టర్ కొండల్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఈ పాట రొమాంటిక్‌గా సాగినా, సెన్సిబుల్‌గా పొయెటిక్‌గా రూపొందించడం విశేషం. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క రిపీటెడ్‌గా వినేలా మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు.
కలర్‌ఫుల్ విజువల్స్
{{/usCountry}}"అదే నీవు అదే నేను" చిత్రంలోని 'మనసా మనసా' పాటను డైరెక్టర్ కొండల్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఈ పాట రొమాంటిక్‌గా సాగినా, సెన్సిబుల్‌గా పొయెటిక్‌గా రూపొందించడం విశేషం. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క రిపీటెడ్‌గా వినేలా మంచి ట్యూన్‌తో కంపోజ్ చేశారు.
కలర్‌ఫుల్ విజువల్స్
{{/usCountry}}టాప్ సింగర్ జావెద్ అలీ తన సహజమైన శైలిలో అద్భుతంగా పాడారు. కొరియోగ్రాఫర్ వేద క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్‌తో కొరియోగ్రాఫ్ చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్స్ త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య అందమైన కెమిస్ట్రీ, డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి కలర్‌ఫుల్ విజువల్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.
'మనసా మనసా' పాట ఎలా ఉందో చూస్తే - ఎన్నెన్నె ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే అంటూ సాగింది.
మనసా మనసా సాంగ్ లిరిక్స్
అలాగే, మారిందే వరసా, నీకైన తెలుసా ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే, బంగారు సొగసా, నీ లేత స్పర్శ, ఎన్నెన్నో మాటల్ని చెబుతున్నదే, తుళ్లిపడకే మనసా మనసా మనసా మనసా కలలా కలిశానులే, ఉన్నట్టుండి వెతికే మలుపే దొరికే మరలా ప్రణయాలు మొదలయ్యెనే, ఉండిపోవే చెలియా చెలియా, చెలియా, చెలియా నీ తీరమే నేను లే, నీకు నాకు ముందే రాసి ఉంచారేమో, నిను వీడి పోలేనులే...అంటూ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.