...
...
Next Story

Bigg Boss Kavya Shree: టీవీ క్వీన్ కావ్యశ్రీ ఎక్కడ? హఠాత్తుగా కుకింగ్ షో నుంచి మిస్సింగ్-బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ?

Bigg Boss 10 Kavya Shree: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఎప్పుడూ లేని విధంగా గొడవలు, ఘర్షణలతో హౌస్ ను హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ వైరల్ గా మారింది. కుకింగ్ షో నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణం.

Published on: Oct 1, 2026, 17:28:17 IST
Advertisement

Bigg Boss Kavya Shree: టీవీ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమెకు తెలుగు అభిమానులు ఎక్కువే. అందుకే కావ్య శ్రీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా కావ్యశ్రీ ఎక్కడ? అనే ప్రశ్న నెట్టింట తీవ్ర వైరల్ గా మారింది. ఆమె బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జోరందుకుంది.

బిగ్ బాస్ లోకి కావ్య

టీవీ క్వీన్ కావ్యశ్రీ ఎక్కడ? హఠాత్తుగా కుకింగ్ షో నుంచి మిస్సింగ్-బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ? (instagram-kavyashree natraj)
టీవీ క్వీన్ కావ్యశ్రీ ఎక్కడ? హఠాత్తుగా కుకింగ్ షో నుంచి మిస్సింగ్-బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ? (instagram-kavyashree natraj)

బిగ్ బాస్ కొత్త సీజన్ గురించి అనౌన్స్ మెంట్ రాగానే హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు అనేదానిపై రకరకాల చర్చలు సాగుతాయి. అలా ప్రతిసారి హౌస్ లోకి కావ్య వెళ్తుందని అంటూనే ఉంటారు. ఈ సారి అయితో పదో సీజన్ కాబట్టి ఆమె ఎంట్రీ కచ్చితంగా ఉందనే ప్రచారం గట్టిగా సాగింది. కానీ చివరకు కొత్త సీజన్ లో ఆమె కనిపించలేదు.

కుకింగ్ షో

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లోకి కావ్య వెళ్లకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇదే సమయంలో ఆహా ఓటీటీలో ప్రారంభమైన చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె కుకింగ్ కామెడీ షోలోకి కావ్య ఎంట్రీ ఇచ్చింది. యాదమ్మ రాజుకు జోడీగా ఆమె ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. దీంతో కావ్య ఇక బిగ్ బాస్ లోకి వెళ్లడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు.

వైల్డ్ కార్డు ఎంట్రీ

ఇప్పుడేమో సడెన్ గా బిగ్ బాస్ 10 తెలుగులోకి కావ్య వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. తాజాగా రిలీజ్ చేసిన చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె ప్రోమోలో కావ్య కనిపించలేదు. ఆమె ప్లేసులో యాదమ్మ రాజుకు జోడీగా యష్మి వచ్చింది. దీంతో కావ్య ఎక్కడ? అనే ప్రశ్న ఊపందుకుంది.

ఇప్పుడు వైల్డ్ కార్డు 2.0 ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లలో కావ్యశ్రీ ఉంటుందని, అందుకే ఆమె కుకింగ్ షో నుంచి తప్పుకొందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ రాబోతున్న ట్రెయిటర్స్ రియాలిటీ షోలో కావ్య పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారమూ సాగుతోంది. మరి కావ్య బిగ్ బాస్ లోకి వెళ్తుందా? ట్రెయిటర్ లోకి ఎంట్రీ ఇస్తుందా? అన్నది వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks