టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల్లో ‘వారణాసి’ ఒకటి. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ చేస్తున్న మూవీ వారణాసి. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను శుక్రవారం (జనవరి 30) అఫీషియల్ గా ప్రకటించేశారు.
వారణాసి రిలీజ్ డేట్

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ భారీ బడ్టెట్ మూవీని ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేయబోతున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించేశారు. కాశీలో కనిపించిన ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఏప్రిల్ 7, 2027నే వారణాసి మూవీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అదే డేట్ ఎందుకు?
వారణాసి మూవీ రిలీజ్ డేట్ పై చర్చలు జోరందుకున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ కు రెడీ చేయాలని రాజమౌళి చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7, 2027ను రిలీజ్ డేట్ గా ప్రకటించడం వెనుక రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
పండగలు ప్లస్ వీకెండ్
ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలవులు ప్లస్ వీకెండ్ చూసుకుని చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. ఓపెనింగ్ లోనే ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి ఈ టెక్నిక్ వాడతారు. ఇప్పుడు రాజమౌళి కూడా ఇదే టెక్నిక్ ను మరో లెవల్లో వాడుతున్నారనే కామెంట్లు వస్తున్నాయి. రెండు తెలుగు ప్రధాన పండగలతో పాటు రెండు లాంగ్ వీకెండ్ లు కలిసి వచ్చేలా వారణాసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని అంటున్నారు.
మాస్టర్ ప్లాన్
వారణాసి సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఆ రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. ఆ రోజు బుధవారం. ఆ తర్వాత గురువారం, శుక్రవారం గడిస్తే మళ్లీ శనివారం (ఏప్రిల్ 10), ఆదివారం (ఏప్రిల్ 11) వీకెండ్. ఇక తర్వాతి వారంలోనూ సెలవులున్నాయి. ఏప్రిల్ 14 (బుధవారం) అంబేడ్కర్ జయంతి రోజు పబ్లిక్ హాలీడే. ఏప్రిల్ 15న శ్రీరామ నవమి. ఇక ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మరో లాంగ్ వీకెండ్ ఉంది.
కలెక్షన్ల రికార్డు
{{/usCountry}}వారణాసి సినిమా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. ఆ రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. ఆ రోజు బుధవారం. ఆ తర్వాత గురువారం, శుక్రవారం గడిస్తే మళ్లీ శనివారం (ఏప్రిల్ 10), ఆదివారం (ఏప్రిల్ 11) వీకెండ్. ఇక తర్వాతి వారంలోనూ సెలవులున్నాయి. ఏప్రిల్ 14 (బుధవారం) అంబేడ్కర్ జయంతి రోజు పబ్లిక్ హాలీడే. ఏప్రిల్ 15న శ్రీరామ నవమి. ఇక ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మరో లాంగ్ వీకెండ్ ఉంది.
కలెక్షన్ల రికార్డు
{{/usCountry}}ఇలా రెండు వారాలు కలిసొస్తాయని రాజమౌళి మాస్టర్ ప్లాన్ తో వారణాసి రిలీజ్ డేట్ ప్రకటించాడని ట్రేడ్ అనలిస్ట్ లు చెబుతున్నారు. రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమాను పర్ఫెక్ట్ టైమింగ్ తో రిలీజ్ చేసి కలెక్షన్ల రికార్డు బ్రేక్ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇందులో రాముడి గెటప్ లో మహేష్ కనిపించనున్నాడనే టాక్ ఉంది. దీంతో తెలుగు వాళ్లతో పాటు దేశంలోని హిందువులకు ప్రధానమైన ఉగాది, శ్రీ రామనవమి కలిసొచ్చేలా వారణాసి రిలీజ్ సెట్ చేశారని అంటున్నారు.