OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సెన్సేషనల్ తమిళ రొమాంటిక్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
తమిళ రొమాంటిక్ డ్రామా విత్ లవ్ ఓటీటీ (OTT) రిలీజ్ కు సిద్ధమైంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఈ సినిమా రూ.36 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు రానుంది.
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ జంటగా నటించిన తమిళ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ‘విత్ లవ్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. ఈ వారమే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. లో బడ్జెట్ మూవీ అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.36 కోట్లు వసూలు చేయడం విశేషం.

విత్ లవ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వెండితెరపై స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రశంసలు అందుకున్న తమిళ మూవీ ‘విత్ లవ్’ (With Love). ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. యువ నటుడు, దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 6న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటం విశేషం.
విత్ లవ్ మూవీ కథాంశం ఇదే..
ఇది ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా. సత్య (అభిషన్), మోనిషా (అనస్వర) అనే ఇద్దరు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులు కుదిర్చిన 'బ్లైండ్ డేట్'లో కలుసుకుంటారు. మాటల సందర్భంలో తామిద్దరం ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు.
ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. స్కూల్ రోజుల్లో తాము ఇష్టపడిన వ్యక్తులను వెతికి పట్టుకుని, అప్పట్లో చెప్పలేకపోయిన తమ మనసులోని మాటను ఇప్పుడు చెప్పాలని ఒక ప్రయాణం మొదలుపెడతారు. ఈ జర్నీలో వారికి ఎదురైన అనుభవాలు, పాత ప్రేమలు ఏమయ్యాయి అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం.
కొత్త దర్శకుడు మదన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. షాన్ రోల్డన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. హరీష్ కుమార్, కావ్య అనిల్, శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సింపుల్ స్టోరీ లైన్‌తో, యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


