OTT SciFi: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్- ఏలియన్‌తో స్నేహం-88 శాతం ఫ్రెష్- తెలుగులో స్ట్రీమింగ్

OTT Sci Fi Thriller Xeno Streaming Today: హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ గ్జెనో ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఇదివరకే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న గ్జెనో నేడు మరో ఓటీటీలోకి అది కూడా తెలుగులో వచ్చేసింది. మరి గ్జెనో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడెక్కడో తెలుసుకుందాం.

Published on: Jul 17, 2026, 12:38:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Sci Fi Thriller Xeno Release Today: సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే అద్భుతమైన విజువల్స్, ఊహకందని గ్రహాంతరవాసులు (ఏలియన్స్) గుర్తొస్తాయి. అలాంటి కోవలోనే ఒక హృదయపూర్వకమైన భావోద్వేగ ప్రయాణాన్ని చూపేందుకు సిద్ధమైంది సరికొత్త హాలీవుడ్ చిత్రం 'గ్జెనో' (Xeno).

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్- ఏలియన్‌తో స్నేహం-88 శాతం ఫ్రెష్- తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్- ఏలియన్‌తో స్నేహం-88 శాతం ఫ్రెష్- తెలుగులో స్ట్రీమింగ్

అమ్మాయితో ఏలియన్ స్నేహం

ఒక సాధారణ అమ్మాయికి, భయంకరంగా కనిపించే ఒక గ్రహాంతరవాసికి మధ్య ఏర్పడిన అపురూపమైన బంధం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ గ్జెనో ఓటీటీలోకి వచ్చేసింది.

'కోయి మిల్ గయా' వంటి సినిమాలు మనుషులకు, ఏలియన్స్‌కు మధ్య ఉండే విడదీయరాని స్నేహాన్ని అద్భుతంగా చూపించి క్లాసిక్‌లుగా నిలిచాయి. సరిగ్గా అదే తరహా అనుభూతిని ఇస్తూనే, కొంత విభిన్నంగా మరికొంత ఉత్కంఠభరితంగా సాగే సరికొత్త కథాంశంతో 'గ్జెనో' సినిమాను మేకర్స్ తెరకెక్కించారు.

ఎడారిలో ఎదురైన ఊహించని పరిచయం

ప్రఖ్యాత నటుడు, నిర్మాత కెవిన్ హార్ట్ నేతృత్వంలోని 'హార్ట్‌బీట్' బ్యానర్‌తో కలిసి మాథ్యూ లోరెన్ ఓట్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. మనుషుల రణగొణ ధ్వనులకు, ఆధునిక నగర జీవితానికి చాలా దూరంగా ఉండే ఒక సుదూర ఎడారి ప్రాంతంలో కథానాయిక రినీ (లులు విల్సన్) నివసిస్తుంటుంది.

ప్రశాంతంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఒకరోజు ఎడారిలోని ఇసుక తిన్నెల మధ్య ఆమెకు ఒక వింత జీవి కనిపిస్తుంది. అది మన భూమికి చెందని ఒక గ్రహాంతరవాసి. మొదట ఆ భయంకరమైన రూపాన్ని చూసి ఆ అమ్మాయి ఎంతగానో భయపడుతుంది.

అయితే ఆ భయం వెనుక ఆ వింత జీవి కూడా ఒంటరితనంతో, ఆందోళనతో బాధపడుతున్నట్లు హీరోయిన్ గుర్తిస్తుంది. అలా భయంతో మొదలైన వారి పరిచయం క్రమంగా జిజ్ఞాసగా, ఆపై ఒక అద్భుతమైన స్నేహ బంధంగా మారుతుంది.

మాటలు లేని బంధం

సాధారణంగా భాష ద్వారానే భావాలను పంచుకుంటాం. కానీ ఈ సినిమాలో అమ్మాయికి, ఏలియన్‌కు మధ్య ఎలాంటి ఉమ్మడి భాష ఉండదు. కేవలం సైగలు, ఒకరినొకరు నిశితంగా గమనించడం ద్వారా నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. పైకి ఎంత క్రూరంగా కనిపించినప్పటికీ, ఆ వింత జీవిలో దాగి ఉన్న సున్నితత్వాన్ని ఆమె గమనిస్తుంది.

రూపం చూసి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదనే సత్యాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతుంది. వారి మధ్య ఉన్న స్నేహం గురించిన రహస్యం బయటకు పొక్కడంతో, ఆ ఏలియన్‌ను ఒక ముప్పుగా భావించే శక్తుల నుంచి కాపాడేందుకు ఆ అమ్మాయి ఎడారి మార్గంలో ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సి వస్తుంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇలా సైన్స్ ఫిక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన గ్జెనో సినిమాకు రొట్టెన్ టొమోటాస్ 88 శాతం ఫ్రెష్ కంటెంట్ అని ప్రకటించింది. అలాంటి గ్జెనో ఓటీటీలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ గ్జెనో ఓటీటీ రిలీజ్ అయింది.

ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో గ్జెనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇదివరకే ఇంకో ఓటీటీలో గ్జెనో అందుబాటులో ఉంది. అదే అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇదే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి అది కూడా సేమ్ 4 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో గ్జెనో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా 2 ఓటీటీల్లో తెలుగులో గ్జెనో అందుబాటులో ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More