Yami Gautam Aditya Dhar: 38 ఏళ్ల వయసులో భర్తను మళ్లీ పెళ్లి చేసుకోమన్న హీరోయిన్ యామీ గౌతమ్- ఎందుకంటే?

Yami Gautam Marriage Request To Aditya Dhar: 38 ఏళ్ల వయసులో హీరోయిన్ యామీ గౌతమ్ తన భర్త, దర్శకుడు ఆదిత్య ధర్‌ని పెళ్లి చేసుకోమ్మని రిక్వెస్ట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆదిత్య ధర్ షేర్ చేసిన ఫొటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. భర్తను మళ్లీ యామీ ఎందుకు పెళ్లి చేసుకోమందన్న విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Published on: Nov 29, 2026, 12:15:59 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Yami Gautam Marriage Request To Aditya Dhar: తెలుగులో 'నువ్విలా', 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ యామీ గౌతమ్ తన 38వ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు.

38 ఏళ్ల వయసులో భర్తను మళ్లీ పెళ్లి చేసుకోమన్న హీరోయిన్ యామీ గౌతమ్- ఎందుకంటే?
38 ఏళ్ల వయసులో భర్తను మళ్లీ పెళ్లి చేసుకోమన్న హీరోయిన్ యామీ గౌతమ్- ఎందుకంటే?

యామీ గౌతమ్ ఆనందం

నవంబర్ 28న తన భర్త, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి అత్యంత సన్నిహితంగా ఈ వేడుకను నిర్వహించుకున్నారు. జీవితంలో తనకు దక్కిన ఈ మధుర క్షణాలకు ఎంతో కృతజ్ఞురాలిని అంటూ యామీ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

బ్లాక్ డ్రెస్‌లో మెరిసిన యామీ.. ఆకట్టుకున్న వేడుకలు

పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను యామీ గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో యామీ నలుపు రంగు దుస్తులు, లాంగ్ కోట్ ధరించి ఎంతో హుందాగా కనిపించగా, ఆదిత్య నీలిరంగు సూట్‌లో ఆకట్టుకున్నారు.

ఒక ఫోటోలో ఆదిత్య తన భార్యను ఆప్యాయంగా హత్తుకుని పోజులివ్వగా, మరో ఫోటోలో అభిమానులు, సన్నిహితులు పంపిన పూల బొకేల మధ్య యామీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. "మీ అందరి ప్రేమకు, పుట్టినరోజు శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు దక్కిన ఈ ఆశీర్వాదానికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని" అని యామీ గౌతమ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఆదిత్య ప్రేమలేఖకు భార్య ఫిదా..

అంతకుముందు ఆదిత్య ధర్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హృదయాన్ని హత్తుకునే సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. విహారయాత్రలో ఇద్దరూ షాపింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ఫోటోలను ఆయన పంచుకున్నారు.

"నాకు తెలిసిన అత్యంత అందమైన మహిళవు నువ్వే. నీ చిరునవ్వు కేవలం ఒక గదిని మాత్రమే కాదు, నా మొత్తం ప్రపంచాన్ని వెలిగిస్తుంది. నువ్వు నా ఇల్లు, నా అతిపెద్ద బలం, నన్ను నిరంతరం ప్రోత్సహించే శక్తివి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే" అని ఆదిత్య ధర్ భావోద్వేగంగా పేర్కొన్నారు.

నన్ను మళ్లీ పెళ్లి చేసుకో ప్లీజ్..

కుటుంబానికి ఇంతటి ప్రేమను పంచుతూనే, వృత్తిపరమైన పనుల్లోనూ వంద శాతం శ్రమించే యామీ తీరు తనను ప్రతిరోజూ ఆశ్చర్యపరుస్తుందని ఆదిత్య కొనియాడారు. సరదాగా తనను తాను 'యామీ పగ్లూ' (యామీ పిచ్చోడిని) అని ఆయన అభివర్ణించుకున్నారు. భర్త ప్రేమకు మురిసిపోయిన యామీ ఆ పోస్ట్ కింద ఆసక్తికరంగా స్పందించారు.

"దయచేసి నన్ను మళ్లీ పెళ్లి చేసుకో.. ప్రతి విషయానికీ చాలా థ్యాంక్స్ మై లవ్! ఎప్పటికీ #ఆదిత్యపగ్లూ" అంటూ ప్రేమ ఎమోజీలతో కామెంట్ చేశారు యామీ గౌతమ్. అంతేకాకుండా ఆదిత్య పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ "నా భర్త.. నా ప్రపంచం.. నా ఆదిత్య" అని రాసుకొచ్చారు.

యామీ గౌతమ్ భర్త ఆదిత్య ధర్ పోస్ట్
యామీ గౌతమ్ భర్త ఆదిత్య ధర్ పోస్ట్

హిమాచల్ సంప్రదాయంలో మొదలైన వీరి ప్రయాణం

2019లో సంచలన విజయం సాధించిన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' సినిమా షూటింగ్ సమయంలో యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో 2021లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో అత్యంత నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో వీరు వివాహం చేసుకున్నారు. కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరైన వీరి పెళ్లి ఫోటోలు అప్పట్లో అందరినీ ఆకట్టుకున్నాయి.

2024లో ఈ దంపతులకు కుమారుడు జన్మించగా.. ఆ బాబుకు వేదావిద్ అని నామకరణం చేశారు. సినిమాల విషయానికొస్తే యామీ ఈ ఏడాది 'నయీ నవేలి' చిత్రంలో నటించగా, ఆదిత్య ధర్ 'ధురంధర్' చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటారు. వెండితెరపై విజయాలతో దూసుకుపోతూనే, నిజ జీవితంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ ఈ జంట ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.