...
...
Next Story

Yash: శృంగారాన్ని మహిళగా ఆమె ప్రెజెంట్ చేసిన విధానం భిన్నంగా ఉంటుంది, నేను చాలా నేర్చుకున్నాను: దర్శకురాలిపై యశ్

Yash About Toxic Director Geetu Mohandas: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న శృంగార సన్నివేశాలపై విమర్శలు వస్తున్న తరుణంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పనితీరుపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 24, 2026, 20:07:40 IST
Advertisement

Yash Comments On Toxic Director Geetu Mohandas: 'కేజీఎఫ్' సిరీస్ హిట్ తర్వాత కన్నడ హీరో యశ్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం యశ్ నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, టాక్సిక్ సినిమా ప్రోమోల్లో కనిపిస్తున్న కొన్ని బోల్డ్ సీన్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

శృంగారాన్ని మహిళగా ఆమె ప్రెజెంట్ చేసిన విధానం భిన్నంగా ఉంటుంది, నేను చాలా నేర్చుకున్నాను: దర్శకురాలిపై యశ్
శృంగారాన్ని మహిళగా ఆమె ప్రెజెంట్ చేసిన విధానం భిన్నంగా ఉంటుంది, నేను చాలా నేర్చుకున్నాను: దర్శకురాలిపై యశ్

టాక్సిక్ సినిమాలోని యాక్షన్ కంటే ఎక్కువగా అందులోని సెన్సువల్ సీన్ల గురించి జనం మాట్లాడుకుంటున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన 'సినిమాకాన్' (CinemaCon) వేడుకలో పాల్గొన్న యశ్, ఈ వివాదాలపై తనదైన శైలిలో స్పందించారు.

మహిళా దర్శకురాలి కోణంలో యాక్షన్ సినిమా

సాధారణంగా గ్యాంగ్‌స్టర్ డ్రామాలు అంటే మగ దర్శకులే తెరకెక్కిస్తారనే అభిప్రాయం మన దేశంలో ఉంది. దీనిపై యశ్ స్పందిస్తూ.. "భారతీయ సినీ చరిత్రలో భారీ యాక్షన్ సినిమాలను కేవలం పురుష దర్శకులే హ్యాండిల్ చేస్తారనే ముద్ర ఉంది. కానీ, 'టాక్సిక్' విషయంలో గీతూ మోహన్ దాస్ ఒక సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఒక గ్యాంగ్‌స్టర్ కథను ఒక మహిళా దర్శకురాలి కోణం (Female Gaze) నుంచి చూడటం అనేది ప్రేక్షకులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది" అని యశ్ పేర్కొన్నారు.

మగ దర్శకులతో పోలిస్తే గీతూ మోహన్ దాస్ పనితీరు ఎలా ఉందనే ప్రశ్నకు యశ్ బదులిస్తూ.. "ఆమె అద్భుతమైన రచయిత్రి. ఒక మహిళగా భావోద్వేగాలను, రొమాన్స్‌ను లేదా శృంగారాన్ని ఆమె ప్రెజెంట్ చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఆమెకు తన పనిపై అపారమైన స్పష్టత, నమ్మకం ఉన్నాయి" అని యశ్ ప్రశంసించారు.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సీన్లు

ఈ విమర్శలపై గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా స్పందించారు. "మహిళల ఆనందం, అంగీకారం (Consent) వంటి విషయాలను జనం అర్థం చేసుకునే వరకు నేను వేచి చూస్తాను" అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టారు.

విడుదల తేదీలో మార్పు

ఇదిలా ఉంటే, ముందుగా టాక్సిక్ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల (West Asia Conflict) నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్స్ ప్రభావితం కావడంతో, టాక్సిక్ విడుదలను వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం 'టాక్సిక్' సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'టాక్సిక్' సినిమా దర్శకురాలు ఎవరు?

ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె గతంలో 'లయర్స్ డైస్', 'మూతోన్' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలను తీశారు.

2. 'టాక్సిక్' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

ప్రస్తుత అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

3. ఈ సినిమాపై వివాదం ఎందుకు మొదలైంది?

సినిమాలోని కొన్ని శృంగార సన్నివేశాలు (Sensual Scenes) శ్రుతిమించాయని, ముఖ్యంగా శ్మశాన వాటిక నేపథ్యంలో తీసిన సీన్లు మనోభావాలను దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks