Yash Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) థియేటర్లలోకి అడుగుపెట్టబోతోంది. వచ్చే వారం విడుదల కానున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన వరమహాలక్ష్మి పండుగ పర్వదినాన బుకింగ్స్ ప్రారంభవుతున్నాయి. దీంతో తమ అభిమాన కథానాయకుడి చిత్రానికి మొదటి రోజే సీట్లు ఖరారు చేసుకునేందుకు సినీ ప్రియులు రెడీ అవుతున్నారు.
12,000 స్క్రీన్లలో రికార్డు విడుదల
టాక్సిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. యష్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ విడుదల కానుంది. థియేటర్ల తుది సంఖ్యపై త్వరలోనే స్పష్టత రానున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న పంపిణీ ఏర్పాట్లను బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో అర్ధమవుతోంది.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) 'ఏ' (Adults Only) సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ఉన్నట్లు సమాచారం.
టాక్సిక్ సందడి
టాక్సిక్ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో నేరుగా నిర్మించగా, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 21 నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయని స్పష్టం చేసింది.
పిల్లలను చూడొద్దన్న యష్
ఈ సినిమా కేవలం పెద్దల కోసం మాత్రమే రూపొందించారని హీరో యష్ ముందే స్పష్టం చేశారు. ఇటీవల 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ యష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}ఈ సినిమా కేవలం పెద్దల కోసం మాత్రమే రూపొందించారని హీరో యష్ ముందే స్పష్టం చేశారు. ఇటీవల 'ఆప్ కీ అదాలత్' కార్యక్రమంలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ యష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
{{/usCountry}}"కళ అనేది మనుషులను అసౌకర్యానికి గురిచేసే ప్రశ్నలను నిలదీయాలి. మనస్సులోని లోతైన కోణాలను తట్టిలేపాలి. అక్కడ తలెత్తే ధర్మసందేహాలను ఎదుర్కొనే అవకాశాన్ని కేవలం కళ మాత్రమే ఇవ్వగలదు. ఒక కథ నిర్దిష్టమైన స్థాయికి చేరుకోవాలంటే, ఈ పాత్రలలోని ప్రతి పొర చాలా ముఖ్యం. కథలను అత్యంత సహజ సిద్ధంగా చెప్పాలని నేను నమ్ముతాను’’ అని యష్ చెప్పుకొచ్చారు.
‘‘అందుకే ఈ సినిమా శీర్షికతో పాటు 'పెద్దల కోసం రూపొందించిన కథ' అనే ట్యాగ్‌లైన్‌ను కూడా యాడ్ చేశాం. చిన్న పిల్లలు లేదా చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న పెద్దల కోసం ఈ సినిమాను తీయలేదని మేము ముందే స్పష్టంగా చెప్పాం" అని యష్ వివరించారు.
డ్యుయల్ రోల్
ఆగస్టు 8న విడుదలైన టాక్సిక్ ట్రైలర్‌లో యష్ ద్విపాత్రాభినయం (రాయా, టికెట్ పాత్రలు) తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ, తారా సుతారియా, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ వంటి భారీ తారగణం నటించింది.
రిలీజ్ డేట్
ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి మొదట అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టింది. మొదట మార్చి 19న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఆ తర్వాత జూన్ 4కి వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్త పంపిణీ ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయడానికి మేకర్స్ చివరకు ఆగస్టు 26 తేదీని ఖరారు చేశారు.