...
...
Next Story

Zareen Khan: బట్టలు మాముందే వేసుకుని చూపించొచ్చుగా.. ఫొటోగ్రాఫర్ వెకిలి మాటలు.. హీరోయిన్ జరీన్ ఖాన్ రిప్లై ఎలా ఉందంటే?

Zareen Khan Slams Photographer Dress Comment: బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ఫొటోగ్రాఫర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమముందే దుస్తులు మార్చుకోవాలంటూ హద్దుమీరి మాట్లాడిన ఒక ఫోటోగ్రాఫర్‌కు ఆమె అక్కడికక్కడే గట్టిగా బుద్ధి చెప్పారు. దీంతో జరీన్ ఖాన్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Published on: Jul 14, 2026, 10:30:42 IST
Advertisement

Zareen Khan Slams Photographer Dress Comment: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల కోసం, వారి ఫోటోల కోసం వెంటపడే కొందరు మీడియా ఫోటోగ్రాఫర్లు (పాపరాజ్జీ) ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. బహిరంగంగా అందరి ముందే బట్టలు మార్చుకోవాలంటూ అసభ్యకరంగా మాట్లాడిన ఒక ఫోటోగ్రాఫర్‌కు ఆమె నోరు మూయించారు.

ఫోటోగ్రాఫర్లకు పోజులు

బట్టలు మాముందే వేసుకుని చూపించొచ్చుగా.. ఫొటోగ్రాఫర్ వెకిలి మాటలు.. హీరోయిన్ జరీన్ ఖాన్ రిప్లై ఎలా ఉందంటే?
బట్టలు మాముందే వేసుకుని చూపించొచ్చుగా.. ఫొటోగ్రాఫర్ వెకిలి మాటలు.. హీరోయిన్ జరీన్ ఖాన్ రిప్లై ఎలా ఉందంటే?

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ముంబైలో సోమవారం (జూలై 13) జరిగిన ఒక ప్రముఖ దుస్తుల బ్రాండ్ ప్రారంభోత్సవానికి జరీన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డెనిమ్ జాకెట్, స్టైలిష్ డ్రెస్ ధరించి వచ్చిన ఆమె.. ఆ బ్రాండ్ సరికొత్త కలెక్షన్‌ను చేతిలో పట్టుకుని ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు.

బట్టలు తమముందే మార్చుకోమంటూ ఫొటోగ్రాఫర్ వెకిలి మాటలు

ఈ క్రమంలో అక్కడ ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ చనువు తీసుకొని, "ఆ బట్టలను ఇక్కడే వేసుకుని చూపించవచ్చు కదా" అంటూ వెకిలిగా మాట్లాడాడు. ఈ మాట విన్న వెంటనే జరీన్ ఖాన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తీవ్ర కోపంతో ఆ ఫోటోగ్రాఫర్ వైపు చూస్తూ గట్టిగా నిలదీశారు.

అందరి ముందే బట్టలు మార్చుకోవాలా

"మీ అందరి ముందే బట్టలు మార్చుకోవాలా? అది ఎప్పటికీ జరగదు. నా దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. నన్ను తక్కువగా అంచనా వేయొద్దు, అందరూ మీ మీ పరిధుల్లో ఉండండి" అని జరీన్ ఖాన్ హెచ్చరించారు. తానేమీ ఇలాంటి దారుణమైన ప్రవర్తనను సహించే వ్యక్తిని కాదని, మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని గట్టి క్లాస్ పీకారు.

సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు

"కనీస మర్యాద లేకుండా ఫోటోగ్రాఫర్లు ఎలా మాట్లాడగలుగుతున్నారు? వీళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని మరొకరు డిమాండ్ చేశారు. కోపం తెచ్చుకున్నా కూడా జరీన్ ఖాన్ ఎంతో హుందాగా, స్పష్టంగా సమాధానం ఇచ్చి బుద్ధి చెప్పిందని ప్రశంసిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ సినిమాతో ఎంట్రీ

2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' చిత్రంతో జరీన్ ఖాన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ సమయంలో ఆమె రూపురేఖలు కత్రినా కైఫ్‌ను పోలి ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 'రెడీ' సినిమాలో సల్మాన్‌తో కలిసి చేసిన 'క్యారెక్టర్ ధీలా' పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీ మూవీలో

ఆ తర్వాత 'హౌస్‌ఫుల్ 2', 'హేట్ స్టోరీ 3', '1921', 'అక్సర్ 2' వంటి సినిమాలతో పాటు పంజాబీ చిత్రాలలోనూ నటించారు జరీన్ ఖాన్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న జరీన్ ఖాన్.. చివరిసారిగా 2021లో జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే' చిత్రంలో కనిపించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks