...
...
Next Story

Zee Telugu Bonala Jathara: సీరియల్ హీరో హీరోయిన్లతో భారీగా బోనాల జాతర ఈవెంట్.. టీవీలో ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

Zee Telugu Bonalu Jatharaki Vastunnam TV Premiere: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను జీ తెలుగు సీరియల్ హీరో హీరోయిన్లు హన్మకొండలో ఘనంగా నిర్వహించారు. నటీనటుల ఆటపాటలు, డ్యాన్సులతో అట్టహాసంగా సాగిన 'బోనాల జాతరకి వస్తున్నాం' ఈవెంట్ టీవీ ప్రీమియర్ ఎప్పుడో ఇక్కడ చూద్దాం.

Published on: Aug 14, 2026, 13:07:12 IST
Advertisement

Zee Telugu Bonalu Jatharaki Vastunnam TV Premiere: తెలంగాణ సంస్కృతికి, విశిష్ట సంప్రదాయాలకు నిలువెత్తు రూపం బోనాల పండుగ. ఆషాఢ, శ్రావణ మాసాల్లో ఊరూరా ఎంతో వైభవంగా జరిగే ఈ ఆమ్మవారి ఉత్సవాలను బుల్లితెర ప్రేక్షకులు మెచ్చేలా జీ తెలుగు ఛానల్ ప్రతిసారీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంటుంది.

సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్

సీరియల్ హీరో హీరోయిన్లతో భారీగా బోనాల జాతర ఈవెంట్.. టీవీలో ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?
సీరియల్ హీరో హీరోయిన్లతో భారీగా బోనాల జాతర ఈవెంట్.. టీవీలో ఎప్పుడు? ఎక్కడ చూడాలంటే?

ఈసారి కూడా తెలంగాణ హృదయాల ప్రతిరూపమైన ఓరుగల్లు గడ్డపై జీ తెలుగు కుటుంబం సందడి చేసింది. హన్మకొండలోని రెవెన్యూ కాలనీ, సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా ‘బోనాల జాతరకి వస్తున్నాం’ పేరుతో భారీ మెగా ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.

ఆగస్ట్ 16న బుల్లితెరపై

వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది అభిమానుల కోలాహలం మధ్య ఈ వేడుక కన్నులపండువగా సాగింది. బుల్లితెర ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఈ మెగా వినోద కార్యక్రమం ఆగస్టు 16, ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో గ్రాండ్‌గా ప్రసారం కానుంది.

స్టేజీపై జీ తెలుగు స్టార్ల రచ్చ.. యాంకర్ రవి ఎనర్జీ!

పాపులర్ యాంకర్ రవి తనదైన శైలిలో చమత్కారాలు, ఎనర్జిటిక్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని నడిపించారు. బుల్లితెర సీరియల్ నటీనటులు, వర్ధమాన కళాకారులు కలసి స్టేజిపై వేసిన డ్యాన్సులు, జానపద రికార్డింగ్ డ్యాన్సులు హన్మకొండ వేదికను ఊపేశాయి.

బుల్లితెర సెలబ్రిటీల హంగామా

ప్రేక్షకులు, అభిమానులతో కలసి సెలబ్రిటీలు చేసిన హంగామా ఆద్యంతం అలరించింది. పండుగ వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన సెటప్‌లో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభిమానుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

ఆటపాటలు.. ఫన్నీ ఛాలెంజ్‌లు!

సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునిక వినోదాల మేళవింపుగా సాగిన ఈ మెగా ఈవెంట్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కట్టిపడేసేలా రూపొందింది. కుటుంబ సమేతంగా వీక్షించేలా రూపుదిద్దుకున్న ‘బోనాల జాతరకి వస్తున్నాం’ విశేషాలను ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు జీ తెలుగులో చూసి ఆస్వాదించవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'బోనాల జాతరకి వస్తున్నాం' ఈవెంట్ ఎప్పుడు ప్రసారం కానుంది?

ఈ ప్రత్యేక కార్యక్రమం ఆగస్టు 16, ఆదివారం రాత్రి 7 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం కానుంది.

2. జీ తెలుగు బోనాల వేడుకలు ఎక్కడ నిర్వహించారు?

ఈ వేడుకను హన్మకొండలోని రెవెన్యూ కాలనీ, సుభేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు.

3. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా ఎవరు వ్యవహరించారు?

బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి తన ఎనర్జిటిక్ వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని నడిపించారు.

4. ఈ ఈవెంట్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి?

జీ తెలుగు సీరియల్ తారల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజికల్ చైర్స్, పుష్-అప్ ఛాలెంజ్, కామెడీ స్కిట్లు మరియు అభిమానులతో సంభాషణలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks